నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్

తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. ‘మర్డర్’ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. నట్టి కరుణ, క్రాంతి సంయుక్తంగా నిర్మించిన రాంగోపాల్‌ వర్మ కుటుంబ కథా చిత్రం ‘మర్డర్‌’. అయితే ఈ సినిమాను మిర్యాలగూడలో విడుదల చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామంటున్నారని నట్టి కుమార్ మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మర్డర్’ సినిమా విషయమై నట్టి కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రారంభం నుంచి మాకు బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. మిర్యాలగూడలో సినిమా విడుదల చేస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామంటున్నారు. విడుదల రోజు నేను, రాంగోపాల్ వర్మ థియేటర్‌కి వస్తాం. మమ్మల్ని చంపేసి.. అనంతరం థియేటర్‌ని ధ్వంసం చేయండి’’ అని నట్టి కుమార్‌ పేర్కొన్నారు. రెండు రోజుల ముందు కూడా నట్టి కుమార్.. థియేటర్ల ఓపెన్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదుగురు మాత్రమే థియేటర్లను ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ ఐదుగురు నిర్మాతలు హోటల్ దస్‌ఫల్లాలో మీటింగ్ పెట్టుకున్నారని వెల్లడించారు.
థియేటర్‌లు దయచేసి ఓపెన్ చేయనివ్వండి. లేకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్తామన్నారు.

కాగా.. ‘మర్డర్’ సినిమాలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గాయత్రీ భార్గవి, సాహితీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం గురించి రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ... ‘‘పిల్లలకు, తల్లిదండ్రులకు జరిగే నిరంతర యుద్ధమే ఈ సినిమా. వారి ఇష్టాలను కాదన్నపుడు ఎలాంటి నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం. 22న మిర్యాలగూడలో ప్రెస్‌ మీట్‌ పెడుతున్నాం’’ అని వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

More News

సినీ ఇండస్ట్రీకి రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన ఏపీ..

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

సింగర్ సునీతను పెళ్లెప్పుడని అడిగితే..

గత కొద్ది రోజులుగా సింగర్ సునీత తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.

భద్రాద్రిలో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదు

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. పండుగంతా భద్రాచలంలోనే ఉన్నట్టుటుంది. అంత వైభవంగా వైకుంఠ ఏకాదశి ఎక్కడా జరగదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.

దిల్‌రాజు ఫంక్షన్‌కి నంద‌మూరి హీరోలు ..రాలేదు ఎందుకు?

తెలుగు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు పుట్టినరోజు శుక్రవారం(డిసెంబర్ 18). ఈ ఏడాది తేజ‌స్విని పెళ్లి చేసుకుని మ‌ళ్లీ లైఫ్‌ను కొత్త‌గా స్టార్ట్ చేశాడు దిల్‌రాజు.

కష్టం వస్తే చెప్పండి ఆదుకుంటా: దిల్ రాజు

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను సినీ ఇండస్ట్రీ పక్కాగా ఫాలో అవుతూ ఉంటుంది.