Nagarjuna - Tabu Relation: ఇన్నేళ్లయినా ఆగని రూమర్లు.. టబూతో ‘‘రిలేషన్‌’’పై స్పందించిన నాగార్జున

  • IndiaGlitz, [Monday,August 29 2022]

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు. నలుగురు వెళ్లే దారిలో కాకుండా భిన్నంగా వెళ్లడం ఆయన స్టైల్. కొత్తదనాన్ని ఇష్టపడే నాగ్.. తెలుగు తెరకు ఎంతోమంది ప్రతిభావంతులైన టెక్నీషీయన్లను , నటీనటులను పరిచయం చేశారు. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు నాగార్జున. అయితే హీరో హీరోయిన్లు అన్నాక లెక్కలేనన్ని రూమర్లు వస్తుంటాయి. వీటిని పట్టించుకునే వారు కొందరైతే.. ఈ చెవిలో విని ఆ చెవితో వదిలేశారు మరికొందరు. ఆ రెండో కోవకే వస్తారు నాగ్. కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో ఆయన పనిచేశారు. ఒకే హీరోయిన్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సందర్భాలు కూడా కోకొల్లలు. అలాంటి వారిలో టబు కూడా ఒకరు.

నిన్నేపెళ్లాడతా చిత్రంతో తొలిసారిగా నటించిన నాగ్- టబు:

వీరిద్దరూ తొలిసారి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్నేపెళ్లడతా’’ చిత్రంలో జంటగా నటించారు. తొలి సినిమాతోనే మంచి కెమెస్ట్రీ పండించడంతో ఆడియన్స్ కూడా ఈ జంటను ఆశీర్వదించారు. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’లో నటించారు . సిసీంద్రిలో టబు స్పెషల్ సాంగ్ కుర్రకారుని ఊర్రూతలుగించింది. ఒకరకంగా టబు నాటి తరంలోని యూత్‌కి డ్రీం గర్ల్‌గా మారిపోయారు.

టబు ఓ అందమైన వ్యక్తి:

అయితే నాగ్- టబు మధ్య ఏదో వుందంటూ అప్పట్లో మీడియా కోడై కూసింది . వీటిని ఇద్దరూ ఎన్నో సార్లు ఖండించారు. కానీ నేటికీ ఈ పుకార్లకు తెరపడటం లేదు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబుతో రిలేషన్‌పై స్పందించారు నాగార్జున. తను నాకు మంచి స్నేహితురాలన్న ఆయన.. తనతో ఫ్రెండ్‌షిప్ ప్రారంభమయ్యే నాటికి నాకు 22 ఏళ్లు, ఆమెకు 16 ఏళ్లు వయసు వుంటుందన్నారు. నేను దాచడానికి కూడా ఏం లేదు. మా రిలేషన్‌ మీరు చూసే కోణంలోనే వుంటుందని నాగ్ అన్నారు. తన వరకు టబు ఓ అందమైన వ్యక్తి , అద్భుతమైన ఫ్రెండ్ అని నాగార్జున కుండబద్ధలు కొట్టేశారు.

More News

ZEE5 లో “హలో వరల్డ్ ” స్ట్రీమింగ్  స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదు...అనురాధ గూడూరు

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా ZEE5 ప్రేక్షకులకు అందిస్తోంది.

Adavi Donga Movie : మత్తు ఇవ్వకుండా.. ‘‘అడవి దొంగ’’ సినిమా చూపిస్తూ, గాంధీలో అరుదైన సర్జరీ

ప్రజల ప్రాణాలను కాపాడటం వైద్యుల కర్తవ్యం. ఈ క్రమంలో కొందరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.

crocodile Attack: వెంటాడిన మొసళ్లు.. చిన్నారి సాహసం, ఆన్‌లైన్‌ని షేక్ చేస్తోన్న వీడియో

నీటిలో మొసలికి బలం ఎక్కువగా వుంటుందంటారు పెద్దలు. నీటిలో వుంటే భారీ ఏనుగునైనా ఖతం చేస్తుంది.

Nitin - J. P. Nadda Meet : హీరో నితిన్‌తో భేటీకానున్న జేపీ నడ్డా.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం

తెలంగాణలో అధికారం అందుకోవడంతో పాటు ఏపీలోనూ బలపడాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.

Sai Vila: దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు?