చైతు మూవీ సీక్రెట్ బయటపెట్టిన కింగ్..!

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అక్టోబ‌ర్ లో ప్రేమ‌మ్, న‌వంబ‌ర్ లో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే...చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించ‌నున్నారు. ఈ సినిమా గురించి ఓ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు కింగ్ నాగార్జున‌.
ఇంత‌కీ నాగ్ ఏమ‌న్నారంటే....నిన్నే పెళ్లాడ‌తా నా ఫేవ‌రేట్ మూవీ. ఈ సినిమా స్టైల్ లో చైత‌న్య సినిమా ఉంటుంది. అలాగ‌ని నిన్నే పెళ్లాడ‌తా చిత్రానికి సీక్వెల్ కాదు. కొత్త‌గా ఉండే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అన్న‌పూర్ణ స్టూడియోస్ టీమ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లో ప్రారంభించ‌నున్నాం అని తెలియ‌చేసారు.నిన్నే పెళ్లాడ‌తా నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. మ‌రి...చైతు కెరీర్ లో ఈ సినిమా ఏస్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి..!

More News

ఓం నమో వేంకటేశాయ రిలీజ్ ఎప్పుడో చెప్పిన నాగార్జున..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

అఖిల్ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పిన నాగ్..!

అక్కినేని అఖిల్ రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఇటీవల నాగార్జున ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు నిర్మలా కాన్వెంట్ మూవీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున ని అఖిల్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...

పూరి ఇజం టీజర్ వచ్చేసింది..!

నందమూరి కళ్యాణ్ రామ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం.

ప్రేమ దేనినైనా గెలుస్తుంది అని చెప్పే ఇన్ స్పైయిరింగ్ లవ్ స్టోరి నిర్మలా కాన్వెంట్ - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా,శ్రేయా శర్మను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్.

ఈ నెల 16న వస్తోన్న 'అత్తారిల్లు'

అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అంజన్ కె.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అత్తారిల్లు’.