బంగార్రాజు టీజర్‌ : నాగ్, చైతూ కుమ్మేశారుగా.. సంక్రాంతికి విందు భోజనమే..!!

  • IndiaGlitz, [Saturday,January 01 2022]

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు . ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేయనున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

న్యూఇయర్ సందర్భంగా ‘‘బంగార్రాజు’’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ విషయానికి వస్తే... సొగ్గాడే చిన్ని నాయన మాదిరిగానే ఇందులోనూ నాగార్జున మరోసారి ఆత్మగా కనిపించారు. సోగ్గాడిగా నాగార్జున స్ట‌యిల్‌ను నాగ చైతన్య బాగా పట్టుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన లుక్, గెటప్ అదిరింది. నాగార్జున నడుమును రమ్యకృష్ణ గిల్లగా... 'ఊరుకోవే పుటుకీ, కితకితలు పెడుతున్నాయి' అని అనడం ఆకట్టుకుంది.

ఇక సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అమ్మాయిగా కృతీ శెట్టి కనిపించింది. 'నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు... మన రాష్ట్రానికి సర్పంచ్‌వి కావాలి. దేశానికి సర్పంచ్‌వి కావాలి' అంటూ అల్లరి చేసే కుర్రాడిగా చైతూ నటన బాగుంది. టీజర్ చివరిలో నాగ్, చైతన్య ఫైట్లు బాగున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు మరోసారి యముడిగా అలరించారు. మరి తండ్రి కొడుకులు ఎలా చేశారో.. ఎంత వినోదం పంచారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురుచూడాల్సిందే.

More News

పుకార్లే నిజమయ్యాయి, షణ్ముఖ్‏తో ఐదేళ్ల బంధానికి బ్రేకప్.. దీప్తి సునయన ఎమోషనల్ పోస్ట్

యూట్యూబర్, టిక్‌టాక్  స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు బిగ్‌బాస్ ఏమాత్రం కలిసొచ్చినట్లుగా లేదు. తృటిలో బిగ్‌బాస్ టైటిల్‌ను చేజార్చుకున్న షన్మూ..

శ్రీకాళహస్తిలో కంగనా రనౌత్ రాహుకేతు పూజలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

న్యూ ఇయర్ వేళ మెగా - నందమూరి అభిమానులకు చేదువార్త.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..?

అనుకున్నట్లుగానే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందు పడ్డ

ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా

లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది... ఇక రచ్చ రచ్చే

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మూవీలోని ‘‘లాలా భీమ్లా’’ సాంగ్ డీజే వర్షన్‌ను రిలీజ్ చేశారు. పాటను ప్రముఖ దర్శకుడు