నేరుగా ఓటిటిలో విడుదలవుతున్న ‘కిన్నెరసాని’ చిత్రం..

  • IndiaGlitz, [Saturday,June 04 2022]

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.

నటీనటులు: కళ్యాణ్ దేవ్, అన్ శీతల్, కాశిష్ ఖాన్,. రవీంద్ర విజయ్, మహతి బిక్షు తదితరులు

More News

అది మీ పని కాదు.. ఆ సర్టిఫికెట్లు గుర్తించబోం, ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీం సంచలన తీర్పు

పెళ్లిళ్లు కోసం ప్రేమికులు, లేక సాధారణ ప్రజలు ఇకపై ఆర్య సమాజ్‌కు వెళితే అలాంటి వారికి చిక్కులు తప్పవు.

RGV Konda Trailer : కొన్నిసార్లు నేరం మంచి తనం నుంచి పుడుతుంది.. ఇంట్రెస్టింగ్‌గా ‘కొండా’ సెకండ్ ట్రైలర్

నిజజీవిత కథలను సినిమాలుగా తెరకెక్కించి హిట్లు కొట్టడంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చేయి.

Shah Rukh Khan- Atlee: ఒంటి నిండా కట్లతో బాలీవుడ్ బాద్‌షా.. షారుఖ్‌-అట్లీ మూవీ టైటిల్ టీజర్‌ రిలీజ్

పాన్ ఇండియా సినిమాల తాకిడితో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.

Actor Satya: టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరో కన్నుమూత

ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Nagababu: 'రుషి కొండ'ను గుండు కొట్టినట్టు కొట్టేశారు... ప్రశ్నించకుండా వుంటామా: నాగబాబు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, సినీనటుడు నాగబాబు. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.