ఆ విషయం సీఎం కేసీఆరే బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

కొన్ని అరాచక శక్తులు తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆరే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదని ప్రశ్నించింది.

ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమకుందని వెల్లడించారు.
రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనమన్నారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయన్నారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే అలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

More News

జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల..

గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ నేడు విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రాత్రంతా స్క్రిప్ట్.. ఉదయం సురభి నాటకం: బీజేపీ, ఎంఐఎంపై రేవంత్ ఫైర్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ట్యాంక్‌బండ్ ఆక్రమణల నేపథ్యంలో పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా..

భారత్ తరుఫున ఆస్కార్‌కు ‘జల్లికట్టు’

తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఈ చిత్రం మన దేశం తరుఫున ఆస్కార్ 2021 బరిలో నిలవడం విశేషం.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది.