'పి.ఎస్.వి.గరుడవేగ 126.18M'లో 'జార్జ్'గా కిషోర్

  • IndiaGlitz, [Friday,May 19 2017]

యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం''పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M''. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో కిషోర్ అత్యంత బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు జార్జ్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు.

త‌న కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ముఖ్యంగా కబాలి,చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్‌కు ఈ జార్జ్ పాత్ర మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. కిషోర్ జార్జ్ పాత్ర గురించి చెప్పాలంటే..జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం... శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి తో డ్డి కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు,భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు... జాలి,దయ,ప్రేమ,కరుణ అతని డిక్షనరీల నే లేవు అనేలా జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది.

డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజ‌న్‌, షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

More News

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ఘనంగా జరిగిన సెయింట్ డాక్టర్ MSG'జట్టు ఇంజనీర్' ప్రియమిర్ షో.

యం యస్ జి, యం యస్ జి 2, లయన్ హార్ట్, నాపాక్ కో జవాబ్, వంటి యాక్షన్ విత్ మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల తరువాత అయిదో మూవీ'జట్టు ఇంజనీర్' మే 19న బాలీవుడ్ లో విడుదల కాబోతున్న సందర్భంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ చిత్రం ప్రియమిర్ షో ప్రదర్శించారు.

దిలీప్ , రెజీన జంటగా 'హరే రామ హరే కృష్ణ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిలీప్ ప్రకాష్,రెజీనా హీరో హీరోయిన్లుగా

ద్విభాషా చిత్రంలో నాగశౌర్య

మద్రాసు పట్టణం,అభినేత్రి చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో రానా...

బాహుబలి,ఘాజీ,నేనే రాజు నేనే మంత్రి వంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న దగ్గుబాటి రానా

బెస్ట్ సింగర్ గా ఎన్టీఆర్...

యంగ్ టైగర్ మంచి యాక్టర్,డ్యాన్సరే కాదు,మంచి సింగర్ కూడా తెలుగులో రభస చిత్రంతో