హైద‌రాబాద్‌లో కె.జె.ఏసుదాస్ లైవ్ క‌న‌సర్ట్

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

ఐదు ద‌శాబ్దాలుగా ఎన్నో ఉత్త‌రాది, ద‌క్షిణాది చిత్రాల్లో త‌న మ‌ధుర గాత్రంతో ప్రేక్ష‌కుల్ని సంగీత స్వ‌ర‌ సాగ‌రంలో ఓల‌లాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌. ఈ జ‌ర్నీలో ఆయ‌న కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌న హైద‌రాబాద్‌లో మ‌న తెలుగు ప్రేక్ష‌కుల కోసం న‌వంబ‌ర్ 11న లైవ్ క‌న‌స‌ర్ట్ ప్రోగ్రామ్ చేయ‌బోతున్నారు. గ‌తంలో మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, ప్ర‌ముఖ హీరోయిన్, భ‌ర‌త నాట్యం డాన్స‌ర్ శోభ‌న‌తో ప్రోగ్రామ్‌ల‌ను నిర్వ‌హించిన 11.2 సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో త‌న సినిమాల్లోని హిట్ పాట‌ల‌ను ఈ లైవ్ క‌న‌స‌ర్ట్‌లో ఏసుదాస్ ఆల‌పించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఏసుదాస్ లైవ్ క‌న‌స‌ర్ట్ జ‌ర‌గ‌లేదు. తొలిసారి ఇలాంటి సంగీత వేడుక ఏసుదాస్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌నుండ‌టం ఆయ‌న అభిమానుల‌కే కాదు.. సంగీతాన్ని ప్రేమించే అంద‌రికీ పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. ఏసుదాస్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు ప్ర‌ముఖ సింగ‌ర్‌ విజ‌య్ ఏసుదాస్ కూడా ఈ లైవ్ క‌న్‌స‌ర్ట్‌లో పాల్గొన‌బోతుండ‌టం విశేషం.

ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.టి.ఆర్ విడుద‌ల చేశారు. న‌వంబ‌ర్ 11 రాత్రి ఏడు గంట‌ల‌కు జ‌ర‌గ‌బోయే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన టికెట్ ధ‌ర రూ.1200. ఈ టికెట్స్ బుక్ మై షో ద్వారా ల‌భ్య‌మ‌వుతాయి.

More News

సుడిగాలి పాటలు విడుదల

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకం

త‌నుశ్రీ వివాదం పై శ‌క్తి క‌పూర్ వ్యంగ్యం

2008లో జ‌రిగిన ఓ డాన్స్ సీక్వెన్స్‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఇటీవ‌ల బాలీవుడ్ తార త‌ను శ్రీ ద‌త్తా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

ద‌క్షిణాది సినిమాల‌ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్‌

అల‌నాటి అందాల తార.. అభిన‌య తార శ్రీదేవి కుమార్తె.. జాన్వీ క‌పూర్ 'ద‌ఢ‌క్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

రౌడీల‌కు విజ‌య్‌దేవ‌ర‌కొండ లేఖ‌..

యూత్‌కు మంచి క్రేజ్ ఉన్న హీరోగా విజ‌య్‌దేవ‌ర‌కొండ ఇమేజ్ ఉంది. అందుకే త‌న‌ను రౌడీ అని.. త‌న అభిమానుల‌ను రౌడీస్ అని విజ‌య్ సంబోధిస్తుంటాడు.

నా ప‌న్నెండేళ్ల క‌ల నేర‌వేరింది - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించిన చిత్రం 'అర‌వింద స‌మేత'.