బాల‌య్య సినిమాలో మ‌రో హీరోయిన్ ఎవ‌రంటే..?

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న బాల‌కృష్ణ.. కోవిడ్ ప్ర‌భావిత నేప‌థ్యంలో అంద‌రి స్టార్స్‌ను ఫాలో అవుతూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కొత్త షెడ్యూల్‌ను రీసెంట్‌గా స్టార్ట్ చేశారు.

ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నార‌ని స‌మాచారం. అందులో ఓ హీరోయిన్‌గా మ‌ల‌యాళ భామ ప్ర‌యాగ మార్టిన్‌ను ఎంపిక చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా.. ఓ సీనియ‌ర్ హీరోయిన్ కూడా బాల‌య్య‌తో న‌టిస్తుంద‌ని టాక్ వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవ‌రా అనే దానిపై చాలా వార్త‌లే వినిపించాయి. సిమ్రాన్‌, స్నేహ స‌హా చాలా మంది పేర్లు ప‌రిశీలించార‌ని స‌మాచారం. కానీ తాజా స‌మాచారం మేర‌కు పూర్ణ‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై బాల‌య్య క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్..

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

‘ఐ రిటైర్’ అంటూ షాక్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు..

‘ఐ రిటైర్’అన్న ట్వీట్‌తో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అభిమానులు షాక్‌కి గురి చేసింది. ఆమె రిటైర్ అవ్వడమేంటని ట్వీట్ చూసిన నెటిజన్లంతా షాక్ అయ్యారు.

'మిస్‌ ఇండియా' .. ఒప్పుకోవడానికి కారణమదే: కీర్తిసురేశ్‌

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ‘అతిథి’ హీరోయిన్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృతా రావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబ సభ్యులు

దిశ నిందితుల కుటుంబ సభ్యులు మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో దిశ ఎన్‌కౌంటర్ చిత్రం మరోమారు తెరపైకి వచ్చింది.