కోన వెంకట్‌ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇటీవల సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పిన కొన్ని విషయాలను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను వెంకట్ విడుదల చేశారు.

నిన్న ‘సాక్షి’ పేపర్‌లో వచ్చిన నా ఇంటర్వ్యూ కి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నానంటూ ఓ ప్రకటనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఫ్యామిలీ పొలిటికల్ బ్రాగ్రౌండ్..

మా కుటుంబం నేను పుట్టక ముందునుండే మా సొంత ఊరైన బాపట్ల లో రాజకీయాల్లో ఉంది.. మీలో చాలామందికి ఈ విషయం తెలుసు. మా తాత గారైన శ్రీ కోన ప్రభాకర రావు గారు కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఒక మచ్చలేని నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. ఆయన మరణం తర్వాత మా బాబాయ్ గారైన కోన రఘుపతి గారు 1995 నుండి ప్రజా సేవలోకి రావడం జరిగింది. తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మా కుటుంబానికి, కోన రఘుపతి గారికి ఉన్న ప్రజాదరణని గుర్తించి జగన్ గారు వైసీపీ తరుపున పోటీచేసే అవకాశం ఇవ్వడం.. గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని నా వంతు కృషి నేను చేశాను. 1983 తర్వాత తిరిగి 2014 లో బాపట్లలో కోన కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు అని కోన చెప్పుకొచ్చారు.

పవన్‌ అభినందించారు..

ఆ సందర్భంలో నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని అభినందించారు. 2014 తర్వాత జనసేనని బలోపేతం చేసే సందర్భంలో , ప్రజలలోకి తీసుకెళ్లే సందర్భంలో పలుమార్లు నేను ఓపెన్ గానే సపోర్ట్ చేయ్యడం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ క్యాడెర్ నుంచి కూడా లోకల్‌గా విమర్శలు ఎదుర్కొన్నాను. అయినా ఒక మిత్రుడిగా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషిగా అతనికి మంచి జరగాలనే ఆశించి మౌనంగా ఉండిపోయాను. అది నా వ్యక్తిగతం అనే చెప్పాను. నా పర్సనల్ లయాలిటీ వేరు.. నా పొలిటికల్ లయాలిటీ వేరు. 30 ఏళ్ల తర్వాత మా కుటుంబాన్ని నమ్మి ఆదరించింది వైసీపీ, జగన్ గారు. అది మేము ఎప్పటికి మరచిపోలేము అని కోన తన మనసులోని మాట చెప్పారు.

సాక్షి ఇంటర్వ్యూ విషయానికొస్తే...

ఇక నా ఇంటర్వ్యూ సంగతికి వస్తే.. మా బావగారైన ద్రోణంరాజు శ్రీనివాస్‌గారు వైజాగ్ దక్షిణ నియోజకవర్గము నుంచి వైసీపీ అభ్యర్థి‌గా పోటీచేస్తున్నారు. అలాగే నా మిత్రుడైన ఎంవీవీ సత్యనారాయణ గారు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వీరిద్దరికి ప్రచారం చేయడానికి వైజాగ్ వెళ్లడం జరిగింది. అప్పుడు ‘సాక్షి’ పేపర్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా పలు విషయాలపై నా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పడం జరిగింది.

మిత్రుడు పవన్ గురించి..

నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అడగడం జరిగింది. తన నిజాయితీ గురించి, తన వ్యక్తిత్వం గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది. పొలిటికల్‌గా తనకి మంచి జరగాలని కోరుకునేవాళ్లలో నేను మొదటి వ్యక్తిని అని చెప్పడం కూడా జరిగింది(ఇది రాయలేదు). పొలిటికల్‌గా మీరు విభేదించే అంశాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు, మాయావతి గారితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో తనని మిస్ గైడ్ చేసారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎందుకు చెప్పానంటే, కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్.. కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా తనే స్వయంగా వాళ్ళ సామరస్య పాలన గురించి మీడియాతో చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనల మీద నాకు అనుమానం వచ్చింది అంతే. చివరిగా నేను చెప్పేదేంటంటే, మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమతలు, ఇవేవి స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు. నేను మరోసారి హృదయపూర్వకంగా అతణ్ణి మంచే కోరుకుంటాను.. ఆయన అనుకున్నది సాధించాలి అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.

More News

దెబ్బ కొడితే పడటానికి ఇదేం 2009 కాదు 2019..

భీమ‌వ‌రం, గాజువాక శాస‌న‌స‌భ స్థానాల నుంచి త‌న‌ను ఓడించ‌డానికి బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు కుట్ర‌లు చేస్తున్నాయ‌ని,  ఆకుట్ర‌ల‌ను తుత్తునీయ‌లు చేసి భారీ మెజార్టీతో విజ‌యం

జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా

జ‌న‌సేన పార్టీ తరఫున ఆంధ్ర‌ప్రదేశ్ శాస‌న‌స‌భకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల పూర్తి జాబితాను విడుదల చేసింది. పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటిన సంగతి తెలిసిందే.

'అవెంజ‌ర్స్‌' కోసం రెహ‌మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో మార్వెల్ కామిక్స్  ఆధారంగా రూపొందిస్తున్న అవెంజెర్స్ సిరీస్‌లో 'అవెంజెర్స్ ఎండ్ ది గేమ్' చిత్రం ఏప్రిల్ 26న విడుద‌ల కాబోతుంది.

చిరు, కె.సి.ఆర్‌ల‌ పై కామెంట్స్‌.. నిర్మాత ఆవేదన‌.. 

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి స‌న్నిహితుడైన నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈరోజు సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరంజీవిపై చేసిన కామెంట్స్‌కు  ...'మీ రాజ‌కీయాలు మీరు చేసుకోండి.

ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌ను: కార్తి

హీరో సూర్య త‌మ్ముడు కార్తి ఇప్పుడు భాగ్యరాజ్ క‌న్న‌న్ సినిమాలో ర‌ష్మిక‌తో న‌టిస్తున్నాడు.