`జాను` వ‌ల్ల దిల్‌రాజుకి న‌ష్ట‌మెంతో తెలుసా?

  • IndiaGlitz, [Monday,February 17 2020]

ఎంత గొప్ప మేక‌ర్ అయినా కొన్ని సినిమాలను అంచ‌నా వేయ‌డంలో త‌ప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా క్లాసిక్ చిత్రాల రీమేక్‌ల విష‌యంలో ఈ త‌ప్ప‌ట‌డుగులు వేయ‌డానికి మ‌నం చూసే ఉంటాం. ఇప్పుడు తెలుగు చిత్ర సీమ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌గా చెప్పుకునే దిల్‌రాజు ప‌రిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే గ‌త కొన్ని చిత్రాల ఫలితాల విష‌యంలో ఆయ‌న అంచ‌నాలు త‌ప్పుతున్నాయి. తాజాగా ల‌వ్‌స్టోరి 'జాను' ఫ‌లితం ఈ విష‌యాన్ని తేట‌తెల్లం చేసింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన '96' చిత్రాన్ని చూసి నచ్చేయ‌డంతో దిల్‌రాజు తెలుగులోకి రీమేక్ చేయాల‌నుకున్నాడు. చాలా మంది వ‌ద్ద‌ని వారించినా దిల్‌రాజు వినిపించుకోలేదు.

శ‌ర్వానంద్, స‌మంత వంటి నటీన‌టుల‌ను పెట్టి 'జాను' పేరుతో రీమేక్ చేశాడు. తెలుగు రీమేక్ మంచి టాక్‌ను సంపాదించుకున్న‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకోవ‌డం మాత్రం విఫ‌ల‌మైంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు జాను సినిమా రూ.20కోట్ల‌కు అమ్మాడ‌ట దిల్‌రాజు. కానీ క‌లెక్ష‌న్స్ మాత్రం లేద‌ట‌. ఇక త‌న‌కు ఉన్న పేరుతో డిజిట‌ల్‌, యూ ట్యూబ్ మార్కెంటింగ్ చేసుకున్నాడ‌ట‌. అంతా క‌లిపినా దిల్‌రాజుకు రూ.5కోట్ల‌కు పైగానే న‌ష్టం వాటిల్లుతుంద‌ట‌. మ‌రి ఈ న‌ష్టాల‌ను దిల్‌రాజు భ‌ర్తీ చేసుకుంటాడోన‌ని అనుకుంటున్నారు.

More News

సురేంద‌ర్ రెడ్డి, వ‌రుణ్‌తేజ్ సినిమా అందుకే ఆగిందా?

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి హిస్టారిక‌ల్ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.

చిన్మ‌యి క్ష‌మాప‌ణ‌లు చెబితేనే చోటిస్తాం:  రాధా ర‌వి

డ‌బ్బింగ్ కళాకారుల సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నికైన సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

డబ్బింగ్ చెప్తున్నంతసేపూ 'భీష్మ' చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది - రష్మికా మందన్న

"డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది.

ఆస్కార్ మూవీకి కోర్టు నోటీసులివ్వాలంనుకుంటున్న నిర్మాత‌

రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఆస్కార్ అవార్డ్స్‌లో ద‌క్షిణ కొరియా చిత్రం `పార‌సైట్‌`కు ఏకంగా నాలుగు అవార్డులు ద‌క్కాయి.

చ‌ర‌ణ్‌పై బ‌న్నీ ఫ్యాన్స్ గుస్సా?

మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు డ‌జ‌ను హీరోలు ఆ ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.