close
Choose your channels

`RRR` ఫైనాన్సియ‌ర్ ఎవ‌రో తెలుసా?

Friday, January 24, 2020 • తెలుగు Comments

`RRR` ఫైనాన్సియ‌ర్ ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు ధీటుగా భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దాన‌య్య‌తో పాటు రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌లు స్లీపింగ పార్ట‌న‌ర్స్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నార‌ట‌.

అంతే కాకుండా ఓ ప్ర‌ముఖ ఛానెల్ అధినేత‌, వ్యాపార‌వేత్త కూడా ఇందులో డ‌బ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. సినిమా బిజినెస్ కూడా 600-700 కోట్ల‌ను టార్గెట్‌గా పెట్టుకుని చేస్తున్నార‌ట‌. బాహుబ‌లి సినిమాపై ఉన్న క్రేజ్‌తో సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఆంధ్రప్రాంత హ‌క్కుల‌ను రూ.100 కోట్ల‌కు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. ఈ చిత్రం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంద‌ని టాక్‌.

అలాగే తెలంగాణ విప్ల‌వ‌వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా బ‌ట్ కీల‌క పాత్ర‌ల్లోన‌టిస్తార‌నే సంగ‌తి కూడా తెలిసిందే. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని స‌హా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz