చరణ్ గురించిన ఈ సీక్రెట్ తెలుసా మీకు

  • IndiaGlitz, [Monday,July 17 2017]

చిరంజీవి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చ‌ర‌ణ్‌ను చూసి చాలా మంది గోల్డెన్ స్పూన్ ప‌ర్స‌న్ అని అనుకుంటారు. కానీ చ‌ర‌ణ్ సినిమాల్లోకి రావ‌డానికి ముందు చాలా క‌ష్ట‌ప‌డ్డాడట‌. ఎనిమిదేళ్ల పాటు శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాడ‌ట‌. ఈ విషయం బ‌య‌ట చాలా మందికి తెలియ‌దు. కానీ ఈ విష‌యాన్ని సుక్కు అంద‌రికీ చెప్పేశాడు. రీసెంట్‌గా సుకుమార్ నిర్మాత‌గా చేసిన సినిమా 'ద‌ర్శ‌కుడు'.

ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా హాజరై యూనిట్‌ను అభినందించాడు. ఈ సంద‌ర్భంలో సుకుమార్, చ‌ర‌ణ్ సంగీతం నేర్చుకున్న విష‌యాన్ని అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు చెప్పాడు. చ‌ర‌ణ్, చిరంజీవి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, మ‌ట్టి మ‌నిషి అని, చాలా నేచుర‌ల్‌గా ఉంటాడని కూడా సుకుమార్ తెలిపాడు. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో 'రంగ‌స్థ‌లం1985' సినిమా తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

More News

అందరికీ చేరువయ్యే టైటిల్ లో చిరంజీవి...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అజిత్ కు విగ్రహం..

అభిమానులందు తమిళ తంబీలు వేరయా...ఇది కాదనలేని సత్యం.

'గౌతమ్ నంద' డెఫనెట్ హిట్ - గోపీచంద్

హీరో గోపీచంద్,హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'

మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' మూడో షెడ్యూల్

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'.

డైరెక్టర్ జయగారు నన్నెంతో ఇన్ స్పైర్ చేశారు - అవంతిక

'చంటిగాడు','గుండమ్మగారి మనవడు','లవ్ లీ'వంటి యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు