close
Choose your channels

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. అంతా మీ ఇష్టమే

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. అంతా మీ ఇష్టమే

వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని ఫీచర్లు వస్తున్నప్పటికీ గ్రూప్స్ నుంచి వచ్చే సందేశాల విషయంలో యూజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి విరుగుడు కనుగొన్న సదరు సంస్థ.. వినియోగదారులకు బ్రహ్మాండమైన సదుపాయాన్ని అందించబోతోంది. ప్రస్తుతం ఈ వాట్సాప్‌‌ను 1.3 బిలియన్ల మంది వాడుతున్నారు.

ఇక ఆ ఇబ్బందులు ఉండవ్..

ఒక యూజర్‌‌కు ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు వస్తుంటుంది.. దీంతో విసిగెత్తిపోతున్న వాట్సాప్‌ యూజర్లకు నిజంగా ఇది ఒక మంచి ఫీచరే అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక గ్రూపులోకి మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేశారనుకోండి.. యాడ్ అయిన తర్వాత ఎగ్జిట్ తప్ప మరో మార్గం లేదు.. ఇది ఇప్పటి వరకూ ఉన్న కథ.

అంతా మీ ఇష్టమే..

అయితే తాజాగా.. ఎవరైనా గ్రూప్‌‌లో చేసినట్లయితే డైరెక్ట్ యాడ్ అయ్యేకి లేదు.. ఎందుకంటే గ్రూపులో చేరాలా వద్దా? అనేది ఇకపై వాట్సాప్‌ వినియోగదారుల చేతుల్లోనే ఉండేలా కొత్త ఫీచర్ రాబోతోంది. ఎవరు బడితే వారు, ఇష్టమొచ్చినట్లుగా గ్రూపుల్లో యాడ్‌ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌ మూడు ఆప‍్షన్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. వాబేటా ఇన్ఫో.కాం అందించిన సమాచారం ప్రకారం ఇన్విటేషన్‌ ఫీచర్‌ను జోడించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజెనెస్‌లో అమలు చేస్తుండగా.. అదనపు భద్రత కోసం వాట్సాప్‌లో కూడా తీసుకురాబోతున్నట్లు సదరు యాప్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. సో.. దీన్ని బట్టి చూస్తే గ్రూప్స్‌లో ఎవరు యాడ్ చేసినా అసలు యాడ్ అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉందన్న మాట.

ఇదిగో ఆఫ్షన్లు ఇలా ఉంటాయ్..

1. నోబడీ(Nobody) : ఎవరికీ మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసే అవకాశం ఉండదు

2. మై కాంటాక్ట్స్‌(My Contacts) : మీ ఫోన్‌‌లో ఉండే కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యూజర్‌ను గ్రూపులో యాడ్‌ చేసేందుకు అనుమతినివ్వడం.

3. ఎవ్రీవన్‌ (Every One) : అంటే యూజర్‌ పరిచయం లేకపోయినా.. కాంటాక్ట్స్‌లో లేకపోయినా గ్రూపులో యాడ్‌ చేసేలా అనుమతినివ్వడం.

పై మూడింటినీ బట్టి చూస్తే.. నో బడీ, మై కాంటాక్ట్స్ ఓన్లీ అనే ఆఫ్షన్లు సూపర్బ్‌గా ఉన్నాయి. పైగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ శాతం మంది ఈ రెండు ఆఫ్షన్లు వాడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ టైమ్‌‌లో, వాట్సాప్ పోటీగా పలు మేసేజింగ్ యాప్‌‌లు కొల్లగా పెరిగిపోవడంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సరికొత్త ఫ్యూచర్లను వినియోగదారులకు అందిస్తోంది. మొత్తానికి చూస్తే వినియోగదారులకు శుభవార్తే కాదు.. బ్రహ్మాండమైన సదుపాయం అని చెప్పుకోవడంలో ఎలాంటి అశియోక్తి లేదేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.