close
Choose your channels

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

Wednesday, September 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే ఇప్పుడు పార్టీకి ఇంత డ్యామేజ్‌ జరిగి ఉండేది కాదనేది నిపుణుల వాదన. కొడాలి నాని వ్యాఖ్యలను పలువురు వైసీపీ నేతలే హర్షించలేకపోతున్నారు. టీడీపీ అధినేత విషయంలోకానీ.. ఆయన కుమారుడు.. పలువురు పార్టీ నేతలపై ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి.

అధినేత కొడాలి నాని ఏమాత్రం కంట్రోల్‌లో పెట్టేందుకు యత్నించలేదని ఇప్పటికీ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఏది ఎలా ఉన్నా.. ఇటీవల తిరుమల డిక్లరేషన్ విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని తలపట్టుకునేలా చేశాయి. స్వంత పార్టీ నేతలే ఈ చర్యలను హర్షించలేకపోతున్నారు. భగవంతుడి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బయటకు చెప్పకపోయినా లోలోపల మదనపడుతున్నారని సమాచారం. మరోవైపు సామాన్య ప్రజానీకం సైతం కొడాలి నాని వ్యాఖ్యలను సహించలేకపోతున్నారు. డిక్లరేషన్ అవసరం లేదు... స్వామి వారి దర్శనానికి ఎవరైనా వెళ్లొచ్చు అనడం వరకూ ఓకే కానీ.. ఆ తరువాత భగవంతుడి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎవరూ హర్షించలేనివి.

తిరుమల డిక్లరేషన్ విషయమై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘‘‘వేరే మతం వాళ్లు సంతకం పెట్టకుండా వెళితే దాని పవిత్రత దెబ్బ తింటుందనా? ఆచారం అంటే ఏంటి? వేరే మతం వాళ్లు వేంకటేశ్వర స్వామిని నమ్మి.. ఆ గుడికి వెళ్ళి.. సంతకం పెట్టకుంటే ఆ గుడి అపవిత్రమై పోతుందా? వేంకటేశ్వర స్వామికేమైనా అపచారం జరుగుతుందా?

హిందువులు సంతకం పెట్టకుండా వెళితే ఆ గుడి అంతా పవిత్రంగా ఉంటుందా? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఆంజనేయ స్వామి చెయ్యి విరగ్గొడితే.. ఆయనకు పోయేదేం లేదు. అలాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏం లేదు. 10 కేజీల వెండి ఎత్తుకు పోయినా ఆరు లక్షలో.. ఏడు లక్షలో.. దాంతో మేడలు.. మిద్దెలు కట్టేదేం లేదు. అంతర్వేదిలో కోటి రూపాయల రథాన్ని తగులబెడితే ప్రభుత్వం రథాన్ని చేయిస్తుంది. దాని వల్ల దేవుడికి పోయేదేం లేదు’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై రాష్ట్రం మొత్తం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. విపక్షాలు మండిపడుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలపై విశాఖ శ్రీనివాసానంద స్వామి కంటతడి పెట్టుకున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తక్షణమే హిందూవులకు మంత్రి కొడాలి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మంత్రి క్షమాపణ చెప్పపోతే... ముఖ్యమంత్రి జగన్ అయినా ఆయన చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి స్పందించక పోతే... తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని శ్రీనివాసానంద స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.