close
Choose your channels

Actress Deepa Suicide : కోలీవుడ్‌లో విషాదం.. యువ నటి దీప ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు

Sunday, September 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తమిళ యువ నటి దీపా అలియాస్ జెస్సీ పౌలెన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వయసు 29 సంవత్సరాలు. చెన్నై విరుగంబాక్కంలోని తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా కథనాలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దీప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని , పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. తన ప్రేమ జీవితంలోని సమస్యల కారణంగానే దీప ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో గుర్తింపు.. సినిమాల్లోకి ఎంట్రీ :

దీప అసలు పేరు పౌలిన్ జెస్సికా మిస్కిన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘తుప్పరివాలన్’తో సహా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల విడుదలైన ‘వైధా’చిత్రంలో దీప హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. నిన్నటి నుంచి దీపను సంప్రదించడానికి ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేశారు. కానీ ఎంతకీ దీప స్పందించకపోవడంతో ఆమె స్నేహితుడు ప్రభాకరన్... విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని ఫ్లాట్‌కు వెళ్లి చూడగా దీప ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె ఫ్లాట్‌లో దొరికిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ప్రేమ గురించి ప్రస్తావించింది. కానీ ప్రియుడు ఎవరు అన్న దానిని మాత్రం తెలియజేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోజుల వ్యవధిలో కోలీవుడ్‌లో విషాదాలు:

కొద్దిరోజుల క్రితమే గేయ రచయిత కబిలన్ కుమార్తె తూరిగ కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతో తూరిగ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణవార్తతో యావత్ కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.