Actress Deepa Suicide : కోలీవుడ్‌లో విషాదం.. యువ నటి దీప ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు

  • IndiaGlitz, [Sunday,September 18 2022]

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తమిళ యువ నటి దీపా అలియాస్ జెస్సీ పౌలెన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వయసు 29 సంవత్సరాలు. చెన్నై విరుగంబాక్కంలోని తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా కథనాలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దీప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని , పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. తన ప్రేమ జీవితంలోని సమస్యల కారణంగానే దీప ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో గుర్తింపు.. సినిమాల్లోకి ఎంట్రీ :

దీప అసలు పేరు పౌలిన్ జెస్సికా మిస్కిన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘తుప్పరివాలన్’తో సహా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల విడుదలైన ‘వైధా’చిత్రంలో దీప హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. నిన్నటి నుంచి దీపను సంప్రదించడానికి ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేశారు. కానీ ఎంతకీ దీప స్పందించకపోవడంతో ఆమె స్నేహితుడు ప్రభాకరన్... విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని ఫ్లాట్‌కు వెళ్లి చూడగా దీప ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె ఫ్లాట్‌లో దొరికిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ప్రేమ గురించి ప్రస్తావించింది. కానీ ప్రియుడు ఎవరు అన్న దానిని మాత్రం తెలియజేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోజుల వ్యవధిలో కోలీవుడ్‌లో విషాదాలు:

కొద్దిరోజుల క్రితమే గేయ రచయిత కబిలన్ కుమార్తె తూరిగ కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతో తూరిగ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణవార్తతో యావత్ కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

More News

BiggBoss: తిని, పడుకోవడానికి వచ్చారా... డియర్ నైన్ అంటూ నాగ్ చీవాట్లు, ఎలిమినేట్ అయిన షాని!

సాధారణంగా బిగ్‌బాస్ అంటే గొడవలు, అలకలు, టాస్క్‌లు అనుకుంటారు. కానీ మన లోపలి మనిషిని నలుగురికి పరిచయం చేసే ఒక అరుదైన ప్రయత్నం.

BiggBoss: కెప్టెన్‌గా రాజ్‌శేఖర్.. చంటి చెంప పగులగొట్టిన ఆర్జే సూర్య , షాకైన సుధీర్‌బాబు

నిన్నటి ఎపిసోడ్‌లో తమ జీవితంలోని విషాద ఘటనలను చెప్పి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను ఏడిపించిన ఇంటి సభ్యులు..

Nachindi Girl Friend: సుకుమార్ చేతుల మీదుగా "నచ్చింది గర్ల్ ఫ్రెండూ" నుంచి 'ఎర్రతోలు పిల్లా..' లిరికల్ సాంగ్ రిలీజ్

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది.

Today Movie Releases : థియేటర్‌లపై చిన్న సినిమాల దండయాత్ర....ఈ రోజు ఎన్ని రిలీజ్‌లో తెలుసా..?

గత కొన్నిరోజులుగా బడా సినిమాలన్నీ థియేటర్లపై దండయాత్ర చేశాయి. వీటిలో జనాన్ని ఆకట్టుకున్నది కొన్నే అయినప్పటికీ..

BiggBoss: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం.. కంటెస్టెంట్స్‌ని ఏడిపించిన సుదీప కథ

గత కొన్నిరోజులుగా గొడవలు, అలకలు, వాగ్వాదాలతో నడిచిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు మాత్రం ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.