స్టైలిష్ స్టార్ కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌యత్నాలు..!

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఈయ‌న‌తో ఓ డిఫ‌రెంట్ సినిమా చేయాల‌ని కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆలోచ‌న చేశాడ‌ట‌. ఆ క్రేజీ కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. గౌత‌మ్ మీన‌న్‌. త‌మిళంలో డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీస్‌, యాక్ష‌న్ మూవీస్‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన ఈ ద‌ర్శ‌కుడుకి తెలుగులో ఘ‌ర్ష‌ణ‌, ఏమాయ చేసావె వంటి సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. ఈయ‌న అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ క‌థ‌ను త‌యారు చేశాడ‌ట‌. ఇప్పుడు అల్లు అర్జున్‌ని క‌లిసి క‌థ‌ను వివ‌రించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడ‌ని టాక్‌. అయితే ఇప్పటికే నెక్ట్స్ మూవీని కొర‌టాల శివ‌తో చేయాల‌ని ఫిక్స్ అయిన అల్లు అర్జున్.. గౌత‌మ్‌మీన‌న్ క‌థ‌ను ఓకే అంటాడా? అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే.

మ‌రోవైపు అల్లు అర్జున్.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ హీరో కావాల‌ని బ‌న్నీ తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మ‌రో నాలుగైదు రోజుల్లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌‌ను తెన్‌కాశి, పొల్లాచ్చి ప్రాంతాల్లో జ‌రుపుకోనుంది. ఆగ‌స్ట్ 13న ప్యాన్ ఇండియా మూవీగా పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.