close
Choose your channels

వ‌రుణ్ తండ్రిగా కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

Tuesday, November 12, 2019 • తెలుగు Comments

వ‌రుణ్ తండ్రిగా కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్‌లో వ‌రుణ్‌తేజ్ మునిగిపోయి ఉన్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌ల్లిదండ్రుల కోసం స్టార్ హీరో, హీరోయిన్స్‌నే ఎంపిక చేశార‌ట‌. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. హీరోగా మాత్రం స్టార్ సీనియ‌ర్ యాక్ట‌ర్ మాధ‌వ‌న్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంలో ఇంకా సినిమాలు చేస్తున్న మాధ‌వ‌న్ తెలుగులో మాత్రం తండ్రి పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌వ‌డం విశేషం. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిన `నిశ్శ‌బ్దం`లో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అలాగే `నంబి:  ది రాకెట్రీ` సినిమాను రూపొందిస్తున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz