వ‌రుణ్ తండ్రిగా కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

ఈ ఏడాది 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల త‌ర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్‌లో వ‌రుణ్‌తేజ్ మునిగిపోయి ఉన్నాడు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌ల్లిదండ్రుల కోసం స్టార్ హీరో, హీరోయిన్స్‌నే ఎంపిక చేశార‌ట‌. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు తల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. హీరోగా మాత్రం స్టార్ సీనియ‌ర్ యాక్ట‌ర్ మాధ‌వ‌న్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంలో ఇంకా సినిమాలు చేస్తున్న మాధ‌వ‌న్ తెలుగులో మాత్రం తండ్రి పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌వ‌డం విశేషం. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిన 'నిశ్శ‌బ్దం'లో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అలాగే 'నంబి: ది రాకెట్రీ' సినిమాను రూపొందిస్తున్నాడు.

More News

'జార్జ్‌రెడ్డి'.. పవన్, వరుణ్‌తో తీద్దామనుకున్నా కానీ...!

తెలుగులో వరస పెట్టి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బయోపిక్‌లకే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కూడా. ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి వెళ్లిపోగా..

జగన్.. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: పవన్ వార్నింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లిళ్లు, పిల్లలపై వైఎస్ జగన్ మాట్లాడటంతో ఇందుకు స్పందించిన పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్.. మీరూ పెళ్లి చేస్కోండి..: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లు, పిల్లలపై ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహా ‘పీఠం’పై కూర్చోవాలని అటు బీజేపీ.. ఇటు శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ కూర్చోవాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు.

మ‌రోసారి మెగా టైటిల్‌తో

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఖైదీ` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది.