Vikram: హీరో విక్రమ్‌కు గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో అభిమానులు

  • IndiaGlitz, [Friday,July 08 2022]

తమిళ స్టార్ హీరో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే విక్రమ్ ఆరోగ్యంపై వైద్యుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు.. పెద్ద సంఖ్యలో చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

షూటింగ్ దశలో రెండు సినిమాలు:

ప్రస్తుతం విక్రమ్ పొన్నియన్ సెల్వన్ , కోబ్రా చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్ 1’ మూవీ టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. ఇంతలో విక్రమ్ గుండెపోటుకు గురికావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అన్నట్లు ఈ చిత్రంలో విక్రమ్ .. ఆదిత్య కరికాలన్ గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో నటిస్తుండటంతో ‘పొన్నియిన్ సెల్వన్ 1’పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక కోబ్రా విషయానికి వస్తే.. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

More News

Matarani Mounamidi: ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న 'మాటరాని మౌనమిది'

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది".

"లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అనిల్ రావిపూడి

దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో

Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు మరణం పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఆర్ధిక సాయం

సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

LPG Cylinder Price : సామాన్యులకు కేంద్రం మరో షాక్.. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంపు, ఎంతో తెలుసా..?

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు ప్రస్తుతం దేశంలో బతకలేని పరిస్ధితి నెలకొంది.

Coronavirus: దేశంలో విస్తరిస్తోన్న కరోనా.. కొత్తగా 16,159 మందికి పాజిటివ్, పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా నెమ్మదించింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.