close
Choose your channels

ఆ సీన్‌ను తొలగించండి: ‘ఆర్ఆర్ఆర్’పై భీం మునిమనవడు

Monday, October 26, 2020 • తెలుగు Comments

ఆ సీన్‌ను తొలగించండి: ‘ఆర్ఆర్ఆర్’పై భీం మునిమనవడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తున్నాడు. అయితే ఇటీవల భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ టీజర్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే టీజర్‌లో ఇటీవల నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి ఓ సీన్‌ను యథావిధంగా తీసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. తాజాగా ఈ టీజర్‌లో కొమరం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జైనూర్ కొమురం భీమ్ యువసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని నిలదీశారు.

కొమురం భీమ్ చరిత్రను అర్ధం చేసుకొని సినిమా తీయాలని.. గిరిజనుల మనోభావాలను దెబ్బ తీయొద్దని.. వెంటనే ఆ దృశ్యాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొమరం భీం మునిమనవడు సొనేరావు సైతం దీనిపై స్పందించారు. ‘‘రాజమౌళి సినిమాపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొమరం భీం చరిత్ర గురించి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు ఇచ్చేవాళ్లం. భీంను మైనారిటీగా చూపించారు. అది మా ఆదివాసీల గౌరవాన్ని దెబ్బతీసింది. మేము దేవుడిగా కొలిచే వ్యక్తిని అలా చూపించి మమ్మల్ని కించపరిచారు. ఆ సీన్‌ను తొలగించాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz