కోమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Monday,December 09 2019]

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై నూతన దర్శకులు కొమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు గా పాత కొత్త నటీనటులతో పాటు కోమరక్క, స్వప్న, వేదం నాగయ్య, పద్మారావు, ఆదినారాయణ, గోవింద్ రాజు ప్రధన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకులు జానకిరామ్ మాట్లాడుతూ... ఉదయ్ భాస్కర్, చందు, పోసాని కృష్ణమురళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశానని తెలిపారు, ఇది నాకు తొలి చిత్రం. అంతర్వేది, మచిలీపట్నం, శ్రీశైలం, వికారాబాద్, హైదరాబాద్ తదితర లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోవడంతో ఒక స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది, ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కోసం సెట్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

కథ విషయానికి వస్తే...ఇది కుటుంభమంతా కలిసి చూడదగ్గ చిత్రం, లవ్, సెంటిమెంట్, కామెడీ, హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ తో పాటు చక్కటి సందేశం ఇస్తుందని తెలిపారు.

More News

ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదని తెలుస్తోంది.

'అమరం అఖిలం' ప్రేమ టీజర్ ఆవిష్కరణ

సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చాలా సినిమాలు ఈ తరాలకు అందట్లేదు.. భద్రపరుచుకోవాలి: చిరు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్‌లో ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఐదవ ఫిల్మ్ ప్రిజర్వేషన్ అండ్ రీస్టోరేషన్ వర్కుషాప్ జరిగింది.

'ఎంత మంచివాడ‌వురా' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

`ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో..

మైనస్ 4 డిగ్రీల చ‌లిలో 'వెంకీమామ‌' కోసం చైతు ప‌డ్డ క‌ష్టం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`.