బీజేపీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేసేసిన కోమటిరెడ్డి!

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.. అంతేకాదు ఇప్పట్లో తేరుకుంటుందా..? అంటే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పలువురు కారెక్కగా మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఇప్పటికే అన్ని మంతనాలు అయిపోయాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి స్పందిస్తూ అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చిచెప్పారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల గ్యాప్‌లోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నేతలకు ధైర్యం లేదు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని అధినాయకత్వం తప్పిదాలతోనే ఈ దుస్థితి వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగని ఆయన ఏపీ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పోరాటం చేసి అధికారంలోకి వస్తే.. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటోళ్లను ఎన్నికల అనంతరం కూడా కొనసాగిస్తుండటం తనకు నచ్చలేదన్నారు. ఇలాంటి నేతలతో ఇంకా ఇరవై ఏండ్లు అయినా పార్టీ బాగుపడదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేసీఆర్‌తో పోరాటం చేసే ధైర్యం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన కామెంట్ చేశారు.

ఇప్పటికిప్పుడు కాదు.. త్వరలోనే!

మాలాంటోళ్లం పోరాటం చేస్తుంటే మా జీవితాలు ఆగం అవుతున్నాయి. సీఎల్పీ నేత ఎన్నికపై అందరితో చర్చించలేదు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా రాష్ట్రంలో పట్టించుకున్న నాధుడు లేడు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యాక కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి నిర్ణయలతో ఇంకా ఇరవై ఏళ్లు టీఆరెస్ అధికారానికి ఢోకా ఉండదు. దేశ భవిష్యతు, యువత భవిష్యత్తు కోసం మోదీ సహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే దేశంలో మోదీ రెండోసారి ఏకపక్ష మెజార్టీ సాధించి ప్రధాని అయ్యారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారతానని చెప్పడం లేదు. రాబోయే రోజుల్లో సరైన సమయంలో నా నిర్ణయం చెబుతాను. కేసీఆర్‌పై పోరాటమే మా ఏకైక లక్ష్యం. దాన్ని బలపరిచే వైపే నా నిర్ణయం ఉంటుంది పరోక్షంగా బీజేపీలో చేరుతున్నానని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే.. అందుకే కోమటిరెడ్డి అటువైపు అడుగులేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితేంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కన్ఫామ్ చేసేసిన కిషన్ రెడ్డి!

కోమటిరెడ్డి మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. దేశ, రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. బీజేపీలో చేరేందుకు యువత ఉత్సాహం చూపిస్తోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాస్తవమే మాట్లాడారని ప్రశంసించారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఆయన చెప్పారన్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు అనేక మంది బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని కిషన్ రెడ్డి కన్ఫామ్ చేసేశారు. బీజేపీలోకి వచ్చే నేతలందర్నీ ఆహ్వానించి పార్టీని మరింత భలోపేతం చేస్తామని... పార్టీ ని భలోపేతం చేసేందుకు పదిలక్షల మంది యువతను సిద్దం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.

More News

మ‌ల్లేశం చిత్రానికి ప్ర‌భుత్వ స‌హకారం అందేలా ప్రయత్నిస్తా: కేటీఆర్

ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా `మ‌ల్లేశం`. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత

అవినీతి పాలనే మా ధ్యేయమన్న ఏపీ డిప్యూటీ సీఎం!

టైటిల్ చూడగానే తప్పుగా ఉంది కదా.. అని కాసింత కన్ఫూజ్ అవుతున్నారా..? అవును మీరు చదివింది నిజమే.. మేం రాసింది నిజమే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తడబడ్డారు.

బాంబ్‌ బ్లాస్ట్‌ సీన్‌లో సందీప్‌ కిషన్‌కు గాయాలు

సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ.బీ.ఎల్‌’.

అది నాది కాదంటున్న నాగ్‌!

తెలుగు ఇండ‌స్ట్రీ మ‌న్మ‌థుడు, అక్కినేని వార‌సుడు నాగార్జున శ‌నివారం ఓ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు.

జూన్ 30న నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు పోటీ చేయ‌నున్న సి.క‌ల్యాణ్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్‌ల వ‌ర్గం

నిర్మాతల మండలి ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రతి రెండెళ్లకొక‌సారి జరిగాల్సిన ఎన్నికలు ఎట్టకేలకు ఈ నెల 30 న  జరుగనున్నాయి.