భోజ్‌పురి మూవీని డైరెక్ట్ చేయ‌నున్న కోన వెంక‌ట్

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

రైట‌ర్‌.. నిర్మాత కోన వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. ఏక కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను కోన వెంక‌ట్ అనౌన్స్ చేశారు. అందులో భోజ్‌పురి మూవీ 'నిర‌హువా చాలాల్ అమెరికా' ఒక‌టి. కోన వెంక‌ట్ డైరెక్ట్ చేయ‌బోయే ఈ సినిమాకు జితేంద్ర యాద‌వ్ కో డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

దినేష్ లాల్ యాద‌వ్‌, అమ్ర‌పాలి దుబే హీరో హీరోయిన్స్‌గా నటించ‌బోతున్నారు. థ్రిల్ల‌ర్ మంజు యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను కంపోజ్ చేస్తారు. కోన వెంక‌ట్ ఫిలిమ్ కార్పొరేష‌న్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.