close
Choose your channels

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న కోన‌!!

Thursday, April 2, 2020 • తెలుగు Comments

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న కోన‌!!

ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్ కోన వెంక‌ట్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారాయ‌న. కెరీర్ ప్రారంభంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు కోన వెంక‌ట్‌. త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ టీమ్‌లో జాయిన్ అయ్యి రైట‌ర్‌గానే సెటిలైపోయాడు. కొంత‌కాలంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ఎదురుచూస్తున్న కోన‌కి ఆ కోరిక త్వ‌ర‌లోనే తీరుతుంద‌ట‌. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. అయితే ఏ సినిమా చేస్తాన‌నే దానిపై ఆయ‌న క్లారిటీ ఇవ్వలేదు.

ప్ర‌స్తుతం కోన ఫిలిం కార్పొరేషన్ బ్యాన‌ర్‌పై కోన వెంక‌ట్ చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న తాజా చిత్రం నిశ్శ‌బ్దం. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఈ చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత నిశ్శ‌బ్దం విడుద‌లను ఖ‌రారు చేస్తారు. ఈ చిత్రంలో అనుష్క‌, మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, మైకేల్ హ‌డ్స‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz