close
Choose your channels

ఆచార్యకు త్రిష.. కాజల్‌కు కొరటాల షాక్.. ఫైనల్‌గా..!

Monday, March 16, 2020 • తెలుగు Comments

ఆచార్యకు త్రిష.. కాజల్‌కు కొరటాల షాక్.. ఫైనల్‌గా..!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా విజయంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే చిరు సరసన కథానాయిక ఎవరనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా.. అనుష్క, కాజల్‌, నయనతార, త్రిష ఇలా చాలా మంది పేర్లు పరిశీలించి.. ఫైనల్‌గా త్రిషనే తీసుకున్నారు. అయితే.. ఆమె షూటింగ్‌లో పాల్గొనక ముందే తాను ఈ చిత్రంలో చేయట్లేదని.. వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో సినిమా యూనిట్‌కు ఊహించని విధంగా షాక్ తగిలినట్లయ్యింది. అంతేకాదు.. సినిమాలో ఎందుకు నటించట్లేదనే విషయమై నిశితంగా ట్విట్టర్ ద్వారా ఆమె వివరించింది కూడా.

కాజల్‌ డిమాండ్‌కు నో..
ఇదిలా ఉంటే.. త్రిష స్థానంలో కాజల్‌ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని ఇప్పటికే ఆమెను సంప్రదించారని కూడా వార్తలు వినిపించాయి. అయితే.. ఈ వార్తలపై అటు కాజల్‌గానీ.. ఇటు చిత్రబృందం కానీ స్పందించకపోవడంతో నిజమేనని అందరూ భావించారు. ఇప్పటికే చిరు సరసన ఖైదీ నంబర్-150లో కాజల్ నటించి మెప్పించడంతో కాజల్‌ను దర్శకనిర్మాతలు సంప్రదించగా.. భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో అంత ఇచ్చుకోలేమని చెప్పగా.. అస్సలు తగ్గేది లేదని తేల్చిచెప్పేసిందట కాజల్. ఇక చేసేదేమీ లేక కాజల్‌ను పక్కనెట్టేశారట. వాస్తవానికి మునుపటిలాగా కాజల్‌గా అంత డిమాండ్ లేదు.. అయినప్పటికీ భారీగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇక ఆ బ్యూటీని వద్దనుకున్నారట. అంటే.. ‘ఆచార్య’కు త్రిష షాకివ్వగా.. కాజల్‌కు కొరటాల షాకిచ్చారన్న మాట. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ యోగా బ్యూటీ అనుష్క దగ్గరికెళ్లిందట.

ఫైనల్‌గా స్వీటీ..!
కాగా.. ఫైనల్‌గా చిరు సరసన నటించాలని స్వీటీ అనుష్కను సంప్రదించే పనిలో దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. కాగా.. టాలీవుడ్‌లో సీనియర్, జూనియర్.. లేడీ ఓరియెంటెడ్ ఇలా చాలా సినిమాల్లో అనుష్క నటించి మెప్పించింది. స్వీటీ నటనకు వేలెత్తి చూపించిన సందర్భాల్లేవ్. అయితే.. ఇంతవరకూ చిరుతో మాత్రం నటించలేదు కానీ.. ‘స్టాలిన్‌’ మూవీలో మాత్రం ‘ఐ వానా స్పైడర్ మ్యాన్’ చిందేసిందంతే. త్వరలో అనుష్క సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత యోగా బ్యూటీ ఖాళీగానే ఉంటుంది. పైగా చిరు సినిమా అనగానే కచ్చితంగా స్వీటీ ఇష్టంగానే ఒప్పుకుంటుందని.. తెలుస్తోంది. మరి ఫైనల్‌గా దర్శకనిర్మాతల మంతనాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో..? స్వీటీ అయినా ఫైనల్ అవుతుందో లేకుంటే టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్ నుంచి బ్యూటీని పట్టుకురావాల్సి ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz