ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ... ఎన్టీఆర్- కొరటాల ఓపెనింగ్‌ వాయిదా...?

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

సినీ పరిశ్రమకు గత కొంతకాలంగా టైం బాగున్నట్లు లేదు. కోవిడ్, లాక్‌డౌన్ సమస్యలకు తోడు ప్రభుత్వాల జోక్యంతో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తోందన్న భయం ప్రేక్షకులను వెంటాడుతోంది. సినిమా రిలీజ్ ప్రకటించినా.. అది చెప్పిన టైంకి వస్తుందా అన్న గ్యారెంటీ లేదు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి నెల 7న పూజా కార్యక్రమాలతో సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఆ ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని అనౌన్స్ చేశారు. అంతా రెడీ... ఇక ప్రారంభోత్సవమే అనుకున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెర్మనీ వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. అయితే త్వరలోనే మరో ముహూర్తం చూసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని మేకర్స్ చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక విద్యార్ధి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో హీరో ఎటువంటి పోరాటం చేశాడు అనే ఇతివృత్తంతో NTR 30 తెరకెక్కుతుందని టాక్.

More News

'రావణాసుర' సెట్‌లో అడుగు పెట్టిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం..

అజిత్ వాలిమై కొత్త రిలీజ్ డేట్.. పవన్ బరిలోకి దిగితే కష్టమే..!!

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా... నేటికీ ఆయనలో అదే క్రమశిక్షణ, పట్టుదల. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వాలిమై’.

విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి..

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి.