close
Choose your channels

డిజిట‌ల్ మాధ్య‌మంలోకి కొర‌టాల‌?

Tuesday, July 28, 2020 • తెలుగు Comments

డిజిట‌ల్ మాధ్య‌మంలోకి కొర‌టాల‌?

నేటి త‌రం స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన కొర‌టాల శివ ట్రెండ్‌ను ఫాలో అవుతూ డిజిట‌ల్ మీడియంలోకి అడుగు పెట్ట‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో కొర‌టాల శివ ఓ ల‌వ్‌స్టోరిని రాశార‌ట‌. దాన్ని ఓ ప్ర‌ముఖ ఓటీటీతో క‌లిసి నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట కొరటాల శివ‌. ఈయ‌న ద‌గ్గ‌ర అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న కిర‌ణ్‌.. ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయంటున్నారు. త‌న స్టైల్‌లో యూత్‌ను ఆక‌ట్టుకునే కథాంశంతో పాటు మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చేలా క‌థ‌ను డిజైన్ చేశార‌ట కొర‌టాల. స్క్రిప్ట్ వ‌ర్క్‌ను ప్ర‌స్తుతం కొర‌టాల అండ్ టీమ్ బిజీగా ఉన్నార‌ట‌.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా తెర‌కెక్కుతోంది. చిరంజీవి 152వ చిత్ర‌మిది. ఇందులో చిరంజీవి రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. దేవాదాయ శాఖాధికారిగా, న‌క్స‌లైట్‌గా చిరంజీవి క‌నిపిస్తారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే న‌ల‌బై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్‌ను ప్రారంభిస్తారు. ‘ఆచార్య‌’ ముగిసిన త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz