హాట్ స్టార్ తో క్రిష్ డీల్ ?

  • IndiaGlitz, [Friday,April 03 2020]

డైరెక్ట‌ర్ క్రిష్‌ను మ‌ల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క డైరెక్ష‌న్ చేస్తూనే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వ‌హిస్తుంటాడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌న్నింటిలోనూ ఆయ‌న నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఒక ప‌క్క ద‌ర్శ‌క నిర్మాత‌గా ఉంటూనే ఇప్పుడు కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. అదేంటో అంద‌రికీ తెలిసిందే. అల్లు అర‌వింద్ స్టార్ట్ చేసిన అహా తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రూపొందుతోన్న కొన్ని వెబ్ సిరీస్‌ల‌ను క్రిష్ రూపొందిస్తున్నాడు. అయితే వీటితో పాటు మ‌రో కొత్త సంస్థ‌తో క్రిష్ వెబ్ సిరీస్ రూపొందించ‌డానికి డీల్ కుదుర్చుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు హాట్ స్టార్ సంస్థ‌లో క్రిష్ ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తాడ‌ట‌. దీనికి స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు నిర్మాణంలోనూ ఆయ‌న భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఇవ‌న్నీ కాకుండా మ‌రో ప‌క్క ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 27వ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ట క్రిష్‌. క‌రోనా ప్ర‌భావంతో ఆగిన షూటింగ్ ఆ ప్ర‌భావం త‌గ్గ‌గానే మ‌ళ్లీ ప్రారంభం అవుతుంది. ఇది పీరియాడిక‌ల్ చిత్రం. మొఘ‌ల్ నేప‌థ్యంలో రూపొంద‌బోయే ఈ చిత్రాన్నికి ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌. విరూపాక్ష అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

More News

మ‌హేశ్ 27లో నిర్మాణం స‌రే.. లాభాలెవరికి ?

సూప‌ర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుందనే వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. మ‌హేశ్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్‌

రెండక్ష‌రాల టైటిల్‌తో బ‌న్నీ...?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.

మెగాస్టార్ చిరు ఇల్లు ఎలా ఉందో చూడండి!?

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ చేసుకున్నారు. దీంతో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు

నిజాముద్దీన్ ఘటనతో 'నమాజ్‌'లపై కీలక ప్రకటన!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది.

షాకింగ్ కేరళలో గర్భిణికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా గంటగంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కేరళ విషయానికొస్తే..