స్క్రిప్టు.. మాట.. అన్నీ తానైన క్రిష్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రిష్ కి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మాంచి జోరైన సక్సెస్ కావాలి. అది ఏ రూపంలో అయినా ఓకే. అందుకే ఆయన ఓ వెబ్‌సీరీస్‌ను స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని అనుకుంటున్నట్టు వినికిడి. ఈ వెబ్ సీరీస్‌కు సంబంధించి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా రాస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట.
ఇప్పుడు సర్వత్రా వెబ్‌సీరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందుకే క్రిష్ తాను కూడా ఆ బాట పట్టాలని అనుకుంటున్నారట. హిందీలో ఓ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తెలుగులోనూ పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్టు వినికిడి. అయితే ఏది ఫైనలైజ్ అయిందో ఆయనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆయన దర్శకత్వం వహించిన `యన్.టి.ఆర్` రెండు భాగాలు ఆయనకు హిట్ తెచ్చిపెట్టలేదు. `మణికర్ణిక` క్రెడిట్ విషయంలోనూ వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అందుకే ఆచితూచి అడుగులు వేయాలని క్రిష్ భావిస్తున్నట్టు వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.