స్క్రిప్టు.. మాట‌.. అన్నీ తానైన క్రిష్‌

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

క్రిష్ కి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మాంచి జోరైన స‌క్సెస్ కావాలి. అది ఏ రూపంలో అయినా ఓకే. అందుకే ఆయ‌న ఓ వెబ్‌సీరీస్‌ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌ని అనుకుంటున్న‌ట్టు వినికిడి. ఈ వెబ్ సీరీస్‌కు సంబంధించి ఆయ‌నే క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు కూడా రాస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇప్పుడు స‌ర్వ‌త్రా వెబ్‌సీరీస్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. అందుకే క్రిష్ తాను కూడా ఆ బాట ప‌ట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. హిందీలో ఓ సినిమా చేస్తార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. తెలుగులోనూ పెద్ద ప్రాజెక్టులు ఉన్న‌ట్టు వినికిడి. అయితే ఏది ఫైన‌లైజ్ అయిందో ఆయ‌నే అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'య‌న్‌.టి.ఆర్‌' రెండు భాగాలు ఆయ‌న‌కు హిట్ తెచ్చిపెట్ట‌లేదు. 'మ‌ణికర్ణిక‌' క్రెడిట్ విష‌యంలోనూ వివాదాలు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. అందుకే ఆచితూచి అడుగులు వేయాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్టు వినికిడి.