మ‌నవ‌డి కోసం మెగాఫోన్ ప‌ట్టిన కృష్ణ‌

  • IndiaGlitz, [Thursday,April 09 2020]

తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించే దిశ‌గా అడుగులు వేసిన హీరోల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. 350 సినిమాల్లో న‌టించిన కృష్ణ‌.. నిర్మాత‌గానే కాదు, ద‌ర్శ‌కుడిగానూ సినిమాల‌ను తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు మీర‌డంతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన వార‌సుడిగా మ‌హేశ్‌బాబు అగ్ర క‌థానాయ‌కుడిగా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుండి మూడో త‌రం వార‌సులు వెండితెర‌పై త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే..మ‌హేశ్ మేన‌ల్లుడు.. గ‌ల్లా జ‌య‌దేవ్‌, ప‌ద్మావ‌తిల కుమారుడు గ‌ల్లా అశోక్ హీరోగా సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా లొకేష‌న్‌కు ఓసారి కృష్ణ వెళ్లార‌ట‌. కృష్ణ‌కు పెద్ద ఫ్యాన్ అయిన డైరెక్ట‌ర్ శ్రీరామ్ ..ఆయ‌న్ని ఓ కోరిక కోరాడు. అదేంటంటే ఓ స‌న్నివేశాన్ని డైరెక్ట్ చేయ‌మ‌ని. ఫ్యాన్ కోరిక‌ను కాద‌న‌లేక‌, మ‌రో ప‌క్క మ‌న‌వ‌డి కోసం కృష్ణ మ‌రోసారి డైరెక్ట‌ర్‌గా మారారు. ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించార‌ట‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ ఆగిన ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

More News

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కాటేస్తున్న తరుణంలో.. ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను

డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో అస్సలు తిరగకండి!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో.