‘‘తేనే మనసులు ’’లో కృష్ణ సెలెక్ట్.. కృష్ణంరాజు రిజెక్ట్: పార్టీ ఇచ్చిన రెబల్ స్టార్, ఆవేశంగా సూపర్‌స్టార్‌

  • IndiaGlitz, [Monday,September 12 2022]

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు టాలీవుడ్‌లో వున్న అతికొద్దిమంది సన్నిహితుల్లో సూపర్‌స్టార్ కృష్ణ కూడా ఒకరు. వీరిద్దరి ఐదు దశాబ్ధాల స్నేహం. కృష్ణను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన సినిమా తేనే మనసులకు ముందే కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడిందట. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరూ కొత్త వారిని సెలెక్ట్ చేశారు. అప్పటికే మూగమనసులు వంటి క్లాసిక్ సినిమా తీసిన ఊపులో వున్నారు ఆదుర్తి. దీంతో ఆయన కొత్త వాళ్లతో సినిమా తీస్తామని ఆంధ్రపత్రికలో ప్రకటన ఇవ్వడంతోనే .. ఆ రోజుల్లో నటన అంటే ఎంతో ఇష్టమున్న వారంతా మద్రాసులోని ఆదుర్తి కార్యాలయానికి ఫోటోలు పంపారు. ఇంకొందరు వ్యక్తిగతంగానే ఆయనను కలిశారు.

కృష్ణ సెలెక్ట్.. కృష్ణంరాజు రిజెక్ట్:

వీరిలోంచి కొందరినీ ఆడిషన్స్‌కు పిలిచారు. అందులో కృష్ణంరాజు కూడా వున్నారు. వీరందరినీ తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో మేకప్ టెస్ట్ చేశారు. ఇది పూర్తయిన తర్వాత కృష్ణ, సంధ్యా రాణిని కలర్ మేకప్ టెస్ట్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందిగా చెప్పారు. కానీ అవకాశం కోసం వస్తుందని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఇంకొందరినీ మాత్రం ఇంటికి వెళ్లమని చెప్పారు. అప్పుడే కృష్ణను హీరోగా సెలక్ట్ చేస్తారని ఆడిషన్స్‌కు వెళ్లిన కృష్ణంరాజు ఊహించారు. ఆయన అనుకున్నట్లుగానే కృష్ణను ఎంపిక చేసినట్లుగా పత్రికల్లో రావడంతో కృష్ణంరాజు ఎంతో సంతోషించారు. అలాగే కృష్ణను మరో 12 మంది మిత్రులను చెన్నై టీ.నగర్‌లోని ‘క్రిసెంట్ పార్క్’లో కృష్ణంరాజు పార్టీ ఇచ్చారు.

కృష్ణతో యాభై ఏళ్ల అనుబంధం:

అయితే అప్పటికే వేషాల కోసం తిరిగి తిరిగి వున్న కృష్ణను సూటిపోటి మాటలతో వేధించిన వారు ఆ పార్టీకి వస్తున్నారు. దీంతో వారికి అక్కడే సమాధానం చెబుతానంటూ సూపర్‌స్టార్ ఊగిపోయారు. అయితే హీరో కాకుండా తొందరపడొద్దంటూ కృష్ణంరాజు మరికొందరు మిత్రులు ఆయనను వారించారట. ఆ తర్వాత కొన్నాళ్లకే కృష్ణంరాజుకు ‘చిలకా గోరింక’తో హీరోగా ఛాన్స్ వచ్చింది. అంతేకాదు కృష్ణ నటించిన అవేకళ్లులో ఆయనకు ప్రతినాయకుడి పాత్ర పోషించి మెప్పించారు. అలా కృష్ణతో కలిసి నేనంటే నేనే, మళ్లీ పెళ్లి, అమ్మకోసం, పెళ్లి సంబంధం, అల్లుడే మేనల్లుడు, అనురాథ, రాజ్ మహల్, అంతా మనమంచికే, హంతకులు - దేవాంతకులు, భలే మోసగాడు, ఇన్స్‌పెక్టర్ భార్య, ఇల్లు ఇల్లాలు, తల్లీకొడుకులు, శ్రీవారు- మావారు, మమత, మాయదారి మల్లిగాడు, స్నేహబంధం, కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, అడవి దొంగలు, అడవి సింహాలు, యుద్ధం, విశ్వనాథ నాయకుడు, ఇంద్ర భవనం, సుల్తాన్ వంటి సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణమిత్రుడు ఇకలేడని తెలిసి కృష్ణ దిగ్భ్రాంతికి గురయ్యారు. నడవలేని స్థితిలో వున్నప్పటికీ.. కృష్ణంరాజు భౌతికకాయానికి స్వయంగా వచ్చి కడసారి వీడ్కోలు పలికారు.

More News

Krishnam Raju  : తెలుగులో పైరసీకి బలైన తొలి హీరో కృష్ణంరాజే.. ఏ సినిమా, ఆ కథేంటీ..?

సినీ రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. కాలంతో పాటు ఇప్పుడిది తన వేషం మార్చుకుంది.

Krishnam Raju: రేపు మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. ముమ్మరంగా ఏర్పాట్లు

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని

Pooja Hegde : పింక్ కలర్ డ్రెస్‌లో నవ్వులు, కొంటె ఫోజులు... ‘‘సైమా’’ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్ట బొమ్మ

దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగులో కమర్షియల్ సినిమాలకు, స్టార్ హీరోల మూవీస్‌కి హీరోయిన్ కావాల్సి వస్తే అందరి చూపు పూజా హెగ్డే వైపే.

Krishnam Raju : స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. కృష్ణంరాజుకు ఇదేనా నివాళి: వర్మ

ఎన్నో చిత్రాలతో మరపురాని పాత్రలతో ఐదున్నర దశాబ్ధాల పాటు తెలుగు ప్రజలను అలరించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

ఈ వారం నో ఎలిమినేషన్... కారణం చెప్పిన నాగ్

బిగ్‌బాస్ 6 తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. అప్పుడే కొందరు కంటెస్టెంట్స్ జనానికి నోటెడ్ అయ్యారు.