పాటల విడుదల సన్నాహాల్లో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్'

  • IndiaGlitz, [Thursday,February 06 2020]

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడిగా అలరారుతున్న ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను.. పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 21 న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో.. 'అల వైకుంఠపురములో' ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 15న నిర్వహిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, ఈ నెల 15న ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్!!

More News

పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవర కొండ.. సరికొత్త టైటిల్..!

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

'ఆర్ఆర్ఆర్‌' లో ఛాన్స్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ

ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టిస్తోన్న హాట్ బ్యూటీ హంస నందిని ఇప్పుడు భారీ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది.

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

డిప్యూటీ సీఎంగా కేటీఆర్.. మంత్రిగా ఐపీఎస్!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? ఆయనతో పాటు ఐపీఎస్ అధికారి కేసీఆర్ మంత్రి వర్గంలోకి రానున్నారా..? అంటే