అక్టోబర్ 18 న  కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ విడుదల

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం 'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్'. శ్రీ‌నాధ్ పుల‌క‌రం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయముతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల‌చేసిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల్లో సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. అక్టోబర్ 18 న గ్రాండ్ గా విడుదలచేస్తున్నారు.

ఈ సందర్భంగా....

ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ - కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంది. అలాగే హీరోయిన్ ఎల్సా కూడా బాగా న‌టించింది. ఇద్దరు డేడికేటెడ్ ఆర్టిస్టులు. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం అవుతుంది.
' అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

న‌టీన‌టులు... కృష్ణ‌, ఎల్సాగోష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, గౌతంరాజ్‌, బెన‌ర్జీ, ర‌విప్ర‌కాష్‌, సూర్య‌, స‌న‌, దొర‌బాబు, సంజు, స‌హ‌స్ర‌, త‌దిత‌రులు

More News

ఎంపీ ఎఫెక్ట్.. ‘ఆదీ’.. మాకొద్దంటున్న బీజేపీ.. !?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య.. జనసేనకు సింగిల్ సర్పంచ్ లేరే!?

రేవంత్.. రేవంత్.. రేవంత్.. గత కొన్ని రోజులుగా ఈ ఫైర్‌బ్రాండ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే వినపడుతోంది.

పెళ్లి చేసుకోవాలంటే ట్రై చేయండి.. కాజల్ రిప్లై!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తోంది కాజల్ అగర్వాల్..

సచివాలయ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వం క్లారిటీ.. అరెస్ట్‌లు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన జరిపిన గ్రామ సచివాలయ పరీక్షా పత్రాలు లీకైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

'90 ఎం.ఎల్‌' చిత్రంలో ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్ దేవ‌దాస్‌గా కార్తికేయ‌

`ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ`, `గుణ‌369` చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు కార్తికేయ‌.