ఫిబ్ర‌వ‌రిలో కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ 'నక్షత్రం' చిత్రానికి సంబంధించి తొలి పది ప్రచార చిత్రాలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే.

వాటికి ప్రేక్షక వర్గాలలో లభించిన ఆదరణ ఈ చిత్రం పై పరిశ్రమలోను, వ్యాపార వర్గాలలోనూ మరింత ఉత్సుకతను పెంచింది. ఈ సందర్భంగా మరోమారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కృతఙ్ఞతలు తెలిపారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలకు సంభందించి కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఫిబ్రవరి నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు నిర్మాతలు.

“పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ “నక్షత్రం” రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో.. సమాజం లో 'పోలీస్' పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ 'నక్షత్రం' లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.

సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె.డి.చక్రవర్తి,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్,స్వామి; పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్ నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ

More News

2016 ఉత్తమ కథా నాయికలు (సమీక్ష)

2016కి గుడ్ బై చెబుతూ 2017కి వెల్ కమ్ చెబుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్, బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ (మేల్), వివాదాలు... గురించి తెలుసుకున్నాం కదా..! ఇక ఇప్పుడు 2016లో తమ అందం, అభినయంతో ఆకట్టుకుని బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ అందించిన కథానాయికలు గురించి క్లుప్తంగా మీకోసం...

ఎన్టీఆర్ న్యూమూవీ లాంఛ్ డేట్ ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కొత్త సంవత్సరం లో 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మాస్ హీరో బాల‌య్య‌, క్లాస్ డైరెక్ట‌ర్ క్రిష్ క‌లిసి చేసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అంద‌రికీ న‌చ్చుతుంది - చిరంత‌న్ భ‌ట్..!

కంచె సినిమాతో టాలీవుడ్ లో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంత‌న్ భ‌ట్. తాజాగా నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందించారు.

రత్తాలుతో చిందేసిన ఖైదీ..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ టీమ్ ఈరోజు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు...అంటూ