ఫిభ్రవరి 12న విడుదలవుతున్న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ'. అందాల రాక్షసి' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిభ్రవరి 12న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ' మా బ్యానర్ నుండి వస్తున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ, సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,థిమాటిక్ టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ గారు మా ఆడియో వేడుకకు వచ్చి చిత్రయూనిట్ ను అభినందించి ఆడియో విడుదల చాలా చేసినందుకు ఆయనకు మా కృత‌జ్ఞ‌త‌లు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది.కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరీన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అవుతుంది.అంతా ఒక టీంగా సిన్సియర్, డేడికేషన్ తో వర్క్ చేశాం. హనురాఘవపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో ఫిభ్రవరి 12న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

More News

'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల

సందీప్, విజయ్ భాస్కర్, ఆనంద్, పూజిత, సారిక పావని హీరో హీరోయిన్లుగా శుభకరి క్రియేషన్స్ బ్యానర్పై గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్(వినయ్) నిర్మిస్తున్న చిత్రం నిన్నే కోరుకుంటా. ప్రణవ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం విడుదలైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తూరుపు జగ్గారెడ్డి బిగ్

సుప్రీమ్ కి సూపర్ బిజినెస్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

50 కోట్ల షేర్ క్రాస్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' సంక్రాంతికి విడుదలై సూపర్హిట్ అయింది.

ఫిభ్రవరి 12న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కి చిరు అభినందన..

బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కి చిరు అభినందన అనగానే... ఎవరా.. బ్లాక్ బష్టర్ డైరెక్టర్ అనుకుంటున్నారా..? ఎవరో కాదు సోగ్గాడే చిన్ని నాయనా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సంక్రాంతి కానుకగా రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో నేటికీ హాస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుండడం విశేషం.