Krishnam Raju: చిరంజీవితో ప్రత్యేక అనుబంధం... మెగాస్టార్‌ బర్త్‌డేకి షాకిచ్చే గిఫ్ట్

దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ మూగబోయింది. అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. అయితే వీరిందరిలో మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ప్రత్యక అనుబంధం వుంది. ఇద్దరూ మొగల్తూరు వాస్తవ్యులు కావడంతో పాటు సినీ రంగంలోనూ సన్నిహితంగా మెలిగేవారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు లేరని తెలిసి చిరు ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు.

మా వూరి హీరో .. పెద్దన్నలా ప్రోత్సహించారు :

‘‘కృష్ణంరాజు గారు ఇక లేరు అనే వార్త విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయనలేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మశాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అని మెగాస్టార్ ట్వీట్‌ చేశారు.

బర్త్ డే నాడు చిరంజీవికి షాకిచ్చిన కృష్ణంరాజు :

ఇకపోతే.. స్నేహానికి ప్రాణమిచ్చే వారు కృష్ణంరాజు. తన వూరికే చెందిన చిరంజీవి సినిమా రంగంలోకి రావడంతో ఆయనను ఎంతగానో ప్రోత్సహించేవారు. చాలా ఎత్తుకు ఎదుగుతావని చిరంజీవి గురించి అప్పుడే చెప్పారట రెబల్ స్టార్. ఓ రోజున ఆయన మేనల్లుడిని వెంటబెట్టుకుని చిరంజీవి బర్త్ డే ఫంక్షన్‌కి వెళ్లారట కృష్ణంరాజు. ఆ సమయంలో రెబల్ స్టార్ మేనల్లుడు లండన్ నుంచి తెచ్చిన కెమెరాతో చిరంజీవి బర్త్ డేకి వచ్చిన సెలబ్రెటీలను, ఇతర ప్రముఖులను ఫోటోలు తీస్తున్నాడు. అప్పుడు మెగాస్టార్‌ ఆ అబ్బాయి మెడలో వున్న కెమెరాను చూసి.. ఎక్కడ తెచ్చావన్నా ఈ కెమెరా, దీనిని లండన్‌లో చూశానని కాకపోతే చాలా కాస్ట్‌లీదని చెప్పి కొనలేదని చెప్పారట. దీనికి కృష్ణంరాజు వెంటనే ఆ కెమెరాను తీసి చిరంజీవి మెడలో వేసి ఇదే నీ బర్త్ డే గిఫ్ట్ అని షాకిచ్చారట.

More News

Krishnam Raju: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Krishnam Raju: నాయకుడిగా, నటుడిగా ఆయన సేవలు ఆదర్శనీయం : కృష్ణంరాజు మృతిపట్ల మోడీ సంతాపం

తెలుగు సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: అసలు కృష్ణంరాజు మరణానికి కారణమేంటీ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా, అలనాటి అగ్రనటుల్లో ఒకరిగా విశేష ప్రజాదరణ వున్న కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు

Geetha Sakshigaa: క్యూరియాసిటీ ని పెంచుతున్న "గీత సాక్షిగా" ఫస్ట్ &సెకండ్ లుక్ పోస్టర్స్

సినిమా అనేది శక్తివంతమైన కళారూపం. సమాజంలోని సత్యాన్ని మరియు కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులకు