'కృష్ణాష్టమి' టీజర్ రివ్యూ...

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

కమెడియన్ గా కెరీర్ ను స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ సునీల్. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు' వంటి సినిమాలతో హీరోగా విజయాలను సొంతం చేసుకున్న సునీల్ నటించిన మిస్టర్ పెళ్ళికొడుకు, భీమరవం బుల్లోడు' ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాయి. దాంతో గ్యాప్ తీసుకున్న సునీల్ ప్రస్తుతం కృష్ణాష్టమి' చిత్రంతో మన ముందుకు రానున్నాడు. హిట్ చిత్రాల నిర్మాతగా ఇండస్ట్రీలో పేరున్న దిల్ రాజు నిర్మాతగా జోష్' ఫేమ్ వాసు వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమాలో సునీల్ ఎలా కనపడున్నానడనే ప్రేక్షకులకు కృష్ణాష్టమి సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో ఒక ఐడియా వచ్చింది. మరి టీజర్ ఎలా ఉందో చూద్దాం..

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అనే టైటిల్స్ తో టీజర్ స్టార్టవుతుంది. తర్వాత స్క్రీన్ పై కనపడే సునీల్ లుక్స్ చూస్తుంటే అన్నీ ఫారిన్ లోకేషన్స్ లోనే కనపడుతున్నాయి. గోకుల కృష్ణ గోపాల జయహో కృష్ణా మురారి అంటే సాగే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వినపడుతుంది. నిక్కి గర్ లాని, డింపుల్ చోపడేలు గ్లామర్ లుక్స్ తో కనపడతారు. ముకేష్ రుషి, అశుతోష్ రాణాలు కూడా మనకు టీజర్ లో కనపడతారు. ఎదుటోడి ముఖంలో సంతోషం చూడటం కోసం ఎంత దూరమైనా వెళతానంటూ సునీల్ డైలాగ్, యాక్షన్ బిట్ కనపడుతుంది. సునీల్ స్టయిల్ గా రన్నింగ్ ట్రయిన్ పక్కన నడుచుకుంటూ వస్తుంటాడు. దాంతో టీజర్ ముగుస్తుంది.42 సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో ఎక్కువ పార్ట్ చాలా ప్లెజంట్ గా కనపడుతుంది. చివర్లో యాక్షన్ పార్ట్ కూడా కనపడుతుంది.

ఇప్పటి వరకు వచ్చిన సునీల్ సినిమాలకు కృష్ణాష్టమి చాలా భిన్నంగా ఉంది. ఒకవైపు సునీల్ ను ఫ్యామిలీ హీరోగా చూపిస్తూనే యాక్షన్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ చిత్రంలో సునీల్ ఎన్నారై పాత్రలో కనిపిస్తాడనే వార్తలకు ఈ టీజర్ కాస్తా బలాన్ని చేకూర్చేదిగా ఉంది. దినేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ గురించి కొత్తగా చెప్పేది ఏమీలేదు..సింపుల్ గా చెప్పాలంటే ఎక్సలెంట్. మొత్తం మీద సునీల్ కి డిఫరెంట్ ఇమేజ్ ను తీసుకోచ్చే చిత్రమవుతుందనేలా ఉంది.

More News

మెగా వార్ లో...విజేత ఎవరు..?

మెగా హీరోలు మధ్య వార్ మొదలైంది.ఇంతకీ మెగా హీరోల మధ్య వార్ ఏమిటనుకుంటున్నారా..?వారం గ్యాప్ తో ముగ్గురు మెగా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

శ్రీమంతుడు అర్ధశతదినోత్సవం ఎక్కడ...?

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.

నాగార్జున 'నిర్మలకాన్వెంట్'

టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో, కొత్త తరహా చిత్రాల్ని నిర్మించడంలో ఎప్పుడూ ముందుండే కింగ్‌ నాగార్జున ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు

మేక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతున్న సూప‌ర్ స్టార్..?

తెలుగు తెర‌పై ఎన్నో ప్ర‌యోగాలు చేసి త‌న‌కంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరో సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌.

'కంచె' రికార్డ్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె.