close
Choose your channels

ఆ విషయం నేనెప్పుడూ ఊహించలేదు.. కన్నీళ్లొచ్చాయి: కృతి శెట్టి

Wednesday, February 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ విషయం నేనెప్పుడూ ఊహించలేదు.. కన్నీళ్లొచ్చాయి: కృతి శెట్టి

హీరోయిన్‌గా తొలిసారిగా ‘ఉప్పెన’ సినిమా ద్వారా కృతిశెట్టి వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాకు సినిమా, పర్సనల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను కృతి శెట్టి పంచుకుంది. తాను ఎందరో నటులకు వీరాభిమానినని.. అలాంటి తనకు అభిమానులు ఏర్పడతారని ఊహించలేదని చెప్పింది. ‘ఉప్పెన’ సినిమాలోని పాటలు.. పోస్టర్స్ విడుదలైన అనంతరం ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నానని వెల్లడించింది. ఈ సినిమా చేసిన అనంతరం తాను వెళ్లిపోదామనుకున్నానని.. కానీ అభిమానుల కారణంగానే ఉండిపోయానని కృతి శెట్టి వెల్లడించింది.

స్వచ్ఛమైన ప్రేమకథ..

తాను కన్నడ కుటుంబంలో జన్మించానని.. అనంతరం బెంగళూరు నుంచి ముంబై వెళ్లి స్థిరపడ్డామని కృతిశెట్టి వెల్లడించింది. ‘ఉప్పెన’ సినిమాకి ముందు తనకు కథానాయికగా అవకాశాలు రాలేదని తెలిపింది. కానీ... చదువుకుంటూనే కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశానని వెల్లడించింది. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ... ఎప్పుడూ సినిమాల్ని కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదని కృతి తెలిపింది. ‘ఉప్పెన’ కోసం దర్శకుడు బుచ్చిబాబు మెసేజ్‌ చేసినప్పుడూ ఆసక్తి కనబరచలేదని వెల్లడించింది. మూడు నెలల పాటు ఆయనతో ఛాటింగ్‌ చేసిన తర్వాత కథ విన్నానని.. అది విన్న తర్వాత తనకు కన్నీళ్లొచ్చాయని... అది అంత స్వచ్ఛమైన ప్రేమకథ అని తెలిపింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రేమకథ రాలేదని... అందుకే వెంటనే అంగీకరించానని కృతి వెల్లడించింది.

ఎదుటి వ్యక్తికీ పేరు రావాలనుకుంటాడు

ఈ సినిమాలో బేబమ్మ అనే ఒక బబ్లీ గర్ల్ పాత్రలో నటించానని కృతి వెల్లడించింది. తాను మెథడ్‌ యాక్టింగ్‌ను నమ్ముతా. అందుకని, భావోద్వేగభరిత సన్నివేశాలు చేసేటప్పుడు... పాత్రలో సహజత్వం కోసం ముందు నుంచి సన్నద్ధమయ్యేదాన్నని వెల్లడించింది. భావోద్వేగభరిత సన్నివేశం చూసి కెమెరామన్ శ్యామ్‌ దత్‌‌కు కన్నీళ్లొచ్చాయని చెప్పడం ఎప్పటికీ మరువలేనని కృతి శెట్టి వెల్లడించింది. దర్శకుడు సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, విజయ్‌ సేతుపతితో పని చేయాలని చాలామంది కోరుకుంటారని... తాను కూడా అదే కోరుకున్నానని తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో తన తొలి చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. వైష్టవ్‌తేజ్‌ అద్భుతంగా నటించాడని... తనతో పాటు ఎదుటి వ్యక్తికీ పేరు రావాలని తపిస్తుంటాడని కృతి వెల్లడించింది.

చిరంజీవి చెప్పిన మాటలు విని..

హిందీలో అనువాదమైన తెలుగు, తమిళ చిత్రాలు చూసేదాన్నని తెలిపింది. అయితే ఆ రెండు భాషల మధ్య నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేదని కృతి వెల్లడించింది. ఏది తెలుగు? ఏది తమిళం? అనేది అప్పట్లో తనకు తెలిసేది కాదని తెలిపింది. కానీ.. చిరంజీవి మాత్రం తెలుసని.. ఆయన సినిమాలు చూశానని కృతి వెల్లడించింది. ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి తన గురించి చెప్పిన మాటలు విని చాలా ఆనందం కలిగిందని వెల్లడించింది. అవి తనకు ఇప్పటి వరకూ వచ్చిన ప్రశంసల్లో అత్యుత్తమైనవిగా పేర్కొంది. తమ సినిమా నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ రషెస్‌ చూసి ఫోన్‌ చేసి బాగా చేశావని మెచ్చుకునేవారని కృతి వెల్లడించింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నానని.. నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబుతో మరో సినిమా చేస్తున్నానని కృతి వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.