జులై 5 న విడుదల కానున్న 'కెఎస్100' చిత్రం..!!

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం కెఎస్100.. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ దక్కించుకోగా జులై 5 న సినిమా ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు..

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. చాలామంది ఈ సినిమా కోసం ఎదురుచూశారు..నా సోషల్ మీడియా లో ఎప్పుడు రిలీజ్ అని అడిగారు.. సినిమాకోసం వెయిట్ అందరికి చాల థాంక్స్.. తప్పకుండా అందరు ఈ సినిమా ను ఆదరించండి.. అన్నారు..

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ కెఎస్100 చిత్రం జులై 5 న రాబోతుంది.. చిత్రం రిలీజ్ లేట్ అయినా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నా.. ప్యూర్ ఫ్యామిలీ సినిమా.. ప్రతి సీన్ లో ఒక మెసేజ్ ఉంది.. ప్రతి ఒక్కరు మనమే గొప్ప అనే ఫీలింగ్ ని తగ్గిస్తుంది.. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది.. సాంగ్స్, ట్రైలర్ ద్వారా మంచి క్రేజ్ ఉంది.. ఆ క్రేజ్ ని ఈ సినిమా మరింత పెంచుతుంది.. అన్నారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కెఎస్100 చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని జులై 5 న దాదాపు 500 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.. ఒక మంచి సినిమా తీస్తే ఎలాంటి అవుట్ ఫుట్ ఉంటుందో అలాంటి సినిమా చేసాం.. డైరెక్టర్ షేర్ మంచి సినిమా చేశారు.. మంచి మెసేజ్ ఉంది.. మేకింగ్ కి ఎంత కష్టపడ్డాడో సినిమా రిలీజ్ కి అంతే కష్టపడ్డాడు.. తప్పకుండ ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు..

నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

More News

తెలంగాణలో ట్రంప్ విగ్రహం.. ఆశ్చర్యపోయిన జనం

అవును మీరు వింటున్నది నిజమే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విగ్రహం తెలంగాణలో వెలిసింది. ఇదేంటి..

అంతా తూచ్ అంటున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈయ‌న కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించే సినిమా

'ఆర్ ఆర్ ఆర్' ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం కుదిరిందా?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `RRR`.

'నిను వీడని నీడను నేనే' సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌

ఓ అమ్మాయితో జీవితమంతా నిను వీడని తోడుగా నీడై నేను ఉంటానని అబ్బాయి చెబుతున్నాడంటే కచ్చితంగా ఆ అబ్బాయిది ప్రేమే.

'ప్రెజర్ కుక్కర్' ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు

కరంపూరి క్రియేషన్స్ అండ్ మిక్ మూవీస్ పతాకంపై సాయి రొనాక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై మరియు సుశీల్ సంయుక్తంగా నిర్మించి, రచించి దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్.