Konda Surekha: ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్‌కు మరోసారి కూడా నోటీసులు పంపించారు.

తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదన్నారు. అయితే ఈ నోటీసులపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. లీగల్‌ నోటీసులు పంపిస్తే భయపడేది లేదని అది పెద్ద సమస్యే కాదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోలో కేటీఆర్‌ లేనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిందే బుద్ధి తక్కువ పని.. దానిని సమర్థించుకోవడానికి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

అంతకుముందు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఎవరో హీరోయిన్లను బెదిరించానని తనపై ఓ మంత్రి విమర్శలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని కాదని.. ఇలాగే అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టామని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీకు వీరుడిలాగా మారారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కాకుండా వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టాలని సూచించారు.

కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశామని అరెస్ట్ అయిన అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసు గులాబీ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయా నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని.. త్వరలోనే అందరికి చట్టప్రకారం శిక్ష పడటం ఖాయమని స్పష్టంచేశారు.

More News

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ

Killi Kruparani: వైసీపీకి మరో షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను

సీమలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.? టీడీపీ ప్రభావం చూపిస్తుందా..?

గతంలో కంటే ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపు కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.

రూ.100కోట్లకు చేరువలో.. 'టిల్లు స్క్వేర్' వసూళ్ల సునామీ..

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్‌బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. మరోసారి టిల్లు గాడి మ్యాజిక్ దెబ్బకు థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.

KTR: హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టిపెట్టడం కాదు..