నిర్మాత ట్వీట్‌కు కెటీఆర్ రిప్లై

  • IndiaGlitz, [Thursday,April 02 2020]

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం స్తంభిస్తే.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారు అట్టుకుడికిపోతున్నారు. ఢిల్లీ వంటి కేంద్ర రాజ‌ధానిలో కార్మికుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఓ వల‌స కూలీ గ‌ర్బిణి అయిన భార్య‌తో క‌లిసి 100 కి.మీ న‌డ‌వ‌టం అంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది. అంద‌రూ ప్ర‌భుత్వాల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌మ రాష్ట్రంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన కార్మికుల‌ను ఆదుకుంటామ‌ని చెబుతూ ప్ర‌తి ఒక్క‌రికీ రూ.500.. 12 కిలోల బియ్యం లేదా గోధుమ పిండి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న నిర్ణ‌యాన్ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఆయ‌న‌లా ఇత‌ర ముఖ్య‌మంత్రులు ప్ర‌జ‌ల‌కు భ‌రోసాను క‌ల్పించ‌లేపోయార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ట్వీట్ చేసి కేసీఆర్‌ను ప్ర‌శంసించారు. క‌రోనా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతుంటే వారిని ఆదుకోవ‌డానికి కేసీఆర్ పెద్ద పెద్ద నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రికీ మంచి చేస్తున్నార‌ని, కానీ జాతీయ మీడియా ప‌ట్టించుకోవ‌డం లేదెందుకు? అంటూ ప్ర‌ముఖ నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కేటీజ‌ర్‌ను జ‌త చేశారు. అయితే శోభు యార్ల‌గ‌డ్డ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. జాతీయ మీడియా అంటే ఢిల్లీకే ప‌రిమితం కాకూడ‌దు. ప‌రిధిని మించి చూసిన‌ప్పుడే అది జాతీయ మీడియా అన్నారు కేటీఆర్‌.

More News

మెగాభిమానుల‌కు ఆ విష‌యంలో నిరాశ త‌ప్ప‌దా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శివగామితో సాయితేజ్ పోరు

గత ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న కోన‌!!

ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్ కోన వెంక‌ట్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారాయ‌న. కెరీర్ ప్రారంభంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా

బాహుబలి రికార్డ్‌లే కాదు..: ప్రభాస్‌పై మాజీ మంత్రి ప్రశంసలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు, నటీనటులు, వ్యాపారవేత్తలు

కరోనాపై పోరుకు విప్రో అధినేత భారీ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ చేయడం..