ప్రియాంక హత్య కేసు: రంగంలోకి దిగిన కేటీఆర్

  • IndiaGlitz, [Friday,November 29 2019]

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై.. సజీవ దహనం చేసి దారుణంగా హత్యచేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడేం జరుగుతుందో అని ఇంటి నుంచి బయటికి పిల్లలను పంపాలంటేనే తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రియాంకరెడ్డి హత్యపై తాజాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కేటీఆర్ రంగంలోకి దిగారు.

మొత్తం నేనే చూసుకుంటా..!
‘ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన కేసును నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. ఈ దారుణ ఘటన కేసులో నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముంది. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుంది. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ ట్వీట్‌కు పలువురు పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పుడే నిద్రలేచారా సార్ అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

'ఇద్ద‌రి లోకం ఒక‌టే' సెన్సార్ పూర్తి..

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో

పచ్చని కాపురంలో ‘వాట్సాప్’ చిచ్చు.. ప్రియుడితో భార్య ఉండగా..!

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వివాహేతర సంబంధాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

సైకిల్ రిపేరు చేయట్లేదని.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు!

టైటిల్ చూడగానే.. అసలు సైకిల్ రిపేర్‌కు పోలీసులకు సంబంధమేంటి..? అని కాస్త వింతగా ఉంది కదూ..

శ్రీ విష్ణు చేతుల మీదుగా 'పటారుపాళెం ప్రేమ కథ' సాంగ్ విడుదల

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పటారుపాళెం ప్రేమ కథ"

ఆర్టీసీపై కేసీఆర్ ఆఖరి ప్రకటన.. కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆఖరి ప్రకటన చేసేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ అధికారులు, మంత్రులతో సమావేశమైన కేసీఆర్..