'కురుక్షేత్రం' టైటిల్ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Friday,June 09 2017]

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా 150వ సినిమా చేస్తున్నాడు. అదే కురుక్షేత్రం. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదల చేశారు.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ విడుదలవుతోన్న ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ఇప్పటికే కన్నడ టైటిల్ టీజర్ అక్కడి స్టార్ హీరోలను సైతం మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు తెలుగులో విడుదలైన టైటిల్ అండ్ టీజర్ కూ అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మరో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ను చూడబోతున్నామనే ఫీలింగ్ ఈ టీజర్ చూస్తుంటేనే కలుగుతోంది. అర్జున్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. మిగిలిన అన్ని కార్యక్రమాలూ అతి త్వరలోనే పూర్తి చేసుకుని కురుక్షేత్రం చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం : సాయిగీతా ఫిలిమ్స్, దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్..

More News

జూలై 10 నుంచి బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

బాలకృష్ణ - పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ 'పైసావసూల్'

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల sensational కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్

జార్జియాలో 'పి ఎస్ వి గరుడవేగ 126.18ఎం' 33 రోజుల భారీ షెడ్యూల్

'పిఎస్ వి గరుడ వేగ 126.18ఎం' చిత్రంలో డా.రాజశేఖర్ హీరోగా,ఆయన భార్యగా పూజా కుమార్ నటిస్తున్నారు.

'2 ఫ్రెండ్స్ చిత్రం' ప్రారంభం

ముళ్ళగూరు లక్ష్మీ దేవి సమర్పణలో అనంత లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్పై ముళ్ళగూరు అనంత రాముడు,మళ్ళగూరు రమేష్ నాయుడు నిర్మిస్తున్న కొత్త చిత్రం '2 ఫ్రెండ్స్'

'నిన్నుకోరి' టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ ఎల్ పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా