'లాల్‌ సింగ్‌ చద్దా'కు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. కరీనా కపూర్ జంటగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ ఆఖరిరోజున ఆమిర్‌ఖాన్‌, చిత్రబృందంతో కేక్‌ కట్‌ చేస్తూ సందడి చేశారు.

హీరోయిన్‌ కరీనా కపూర్‌ ‘లాల్‌ సింగ్‌’ తనకెంతో ప్రత్యేమని గతంలోనే పంచుకున్నారు. అయితే ‘‘లాల్‌ సింగ్‌ చద్దా షూటింగ్‌ వేళ ఎన్నో సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి. మహమ్మారి కరోనా ఉండటం, తాను రెండోసారి గర్భం దాల్చడంతో ఒకింత భయానికి గురయ్యా. అయితే ఇవేవీ షూటింగ్‌ పై తనకున్న ఆసక్తిని ఆపలేదని. ఇక చిత్రీకరణ జరిగేంత వరకూ జాగ్రత్త చర్యలు పాటించాం’’ అని అభిమానులతో పంచుకున్నారు కరీనా.

దేశవ్యాప్తంగా వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాటిలో తెలుగు రాష్రాల్లోని కాకినాడ, అమలాపురం, హైదరాబాద్‌ లొకేషన్లు కూడా ఉన్నాయి. 170 రోజులు షూటింగ్‌ జరిపారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. 1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ 2020 మార్చిలో నిలిపివేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా చూడాలంటే 2021 క్రిస్మస్‌ వరకూ ఆగాల్సిందే!

More News

కోటు వేసుకుంటే 'బరువు' తెలిసింది.. డాక్టర్ పాత్రపై రకుల్ ఎమోషనల్

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇక్కడ ఆఫర్లు లేవు. అయితే ఈ అమ్మడికి అదృష్టం కొంచెం ఎక్కువగా వుండటంతో బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా ‘ప‌రిణ‌యం’..తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రీమియ‌ర్‌గా సెప్టెంబర్ 24న విడుదల

లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, పాత్ బ్రేకింగ్ వెబ్ షోస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌ని పనిమనిషిని చేసేశారుగా... శ్రీరామ్, హమీదా రొమాన్స్

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంట‌ర్‌టైనింగ్‌గా మొద‌లైన‌ప్ప‌టికీ, గ‌త సీజ‌న్ 4 కంటే త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్ న‌మోదు చేసింది.

దుల్కర్ సల్మాన్ ఆవిష్క‌రించిన `హ‌ను-మాన్`  ఫస్ట్ లుక్ పోస్ట‌ర్

అ!, క‌ల్కి, జాంబిరెడ్డి వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు

హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్.. షాకింగ్ రెమ్యూనరేషన్..?

మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు.