Download App

ల‌గ‌డ‌పాటి - కందుకూరి!

రామ‌ల‌క్ష్మీ క్రియేష‌న్స్ అధినేత‌గా ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ అంద‌రికీ తెలుసు. అలాగే పెళ్లిచూపులు నిర్మాత‌గా రాజ్ కందుకూరి కూడా అంద‌రికీ తెలుసు. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ త‌న‌యుడు విక్ర‌మ్ కొన్ని సినిమాలు చేశాడ‌న్న సంగ‌తి కూడా తెలుసు. అయితే రాజ్ కందుకూరికి శివ అని ఓ కొడుకున్నాడ‌ని.. అత‌ను సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌ని ట్రెయిన్ అవుతున్నాడ‌నే సంగ‌తి మాత్రం అత్యంత కొద్ది మందికే తెలుసు.

ఇదంతా ఎందుకు అంటే.. అక్క‌డికే వ‌స్తున్నాం. అటు విక్ర‌మ్‌, ఇటు శివ ఇద్ద‌రూ ఒకే సినిమాతో హీరోలుగా ప‌రిచ‌యం కానున్నార‌ట‌. అటు రామ‌ల‌క్ష్మీ సినీ క్రియేష‌న్స్ ఇటు రాజ్‌కందుకూరి ఇద్ద‌రూ క‌లిసి ఆ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

శ్రీనివాస‌రెడ్డితో జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా అనే సినిమాను రూపొందించిన ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల సెల‌క్ష‌న్ జ‌రుగుతోంది.