లగడపాటి విక్రమ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,January 22 2022]

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు అతని పర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ యంగ్ టాలెంట్ వర్జిన్ స్టోరి చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విక్రమ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – అచు రాజమణి, సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ – గ్యారీ, సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర, నిర్మాతలు – లగడపాటి శిరీష్, శ్రీధర్, రచన దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.

More News

హ్యాపీ బర్త్ డే టూ నాగశౌర్య.. పుట్టినరోజు కానుకగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్‌లుక్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను ఆకట్టుకుంటున్నారాయన. గతేడాది వరుడు కావలెను సినిమాతో మంచి విజయాన్ని

ఆహా ఓటీటీ... అల్లు అర్జున్‌ని దింపుతోన్న అల్లు అరవింద్, నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే

సినిమాలు , షూటింగ్‌లు, వ్యాపారాలతో బిజీగా వుండే స్టార్స్ ఇటీవలి కాలంలో తమ పంథా పూర్తిగా మార్చేశారు. ఒకరి తర్వాత ఒకరు బుల్లితెర మీద హోస్ట్‌లుగా రాణిస్తున్నారు.

రహస్యంగా తల్లిదండ్రులైన ప్రియాంక- నిక్ జోడి.. అభిమానులకు షాక్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌ దంపతులు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. సరోగసీ విధానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట ప్రకటించింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అఖండ !!

ఒక సంచలనం.. ఒక ప్రభంజనం అని తెలుగు ప్రేక్షకులు ముక్త కంఠంతో విశేషమైన విజయాన్ని అందించిన "అఖండ" సినిమా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ అవుతుంది.

ముంబైలో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ప్రత్యేక పూజలు, ఫోటోలు వైరల్

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతోన్న పూజా హెగ్డే ముంబైలో తన డ్రీమ్ హౌస్‌లో అడుగుపెట్టారు.