చిరంజీవిని ఎత్తేస్తుంది...

  • IndiaGlitz, [Monday,October 17 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్‌లో కాలు క‌దుపుతుంది.

క్యాథ‌రిన్ స్థానంలో స్పెష‌ల్ సాంగ్ కోసం ల‌క్ష్మీరాయ్ ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 'చిరంజీవిగారితో న‌టించడం నా క‌ల‌. ఖైదీ నంబ‌ర్ 150 సెట్స్‌లో ఆయ‌న‌తో డ్యాన్స్ చేయ‌డం మ‌రిచిపోలేని అనుభూతి. ర‌త్నంలాంటి మ‌నిషి..మ‌న‌సు బంగారం.. అందుకే నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షి, ఆయ‌న‌ గురించి చెప్పాలంటే మాట‌లు స‌రిపోవ‌డం లేదు..అంటూ ల‌క్ష్మీరాయ్ చిరును త‌న ట్విట్ట‌ర్‌లో ఆకాశానికెత్తేస్తుంది. త‌మ్మ‌డు ప‌వ‌ర్‌స్టార్‌తో సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లో చిందేసిన ల‌క్ష్మీరాయ్‌, ఇప్పుడు అన్న‌య్య మెగాస్టార్‌తో న‌ర్తిస్తుంది.

More News

హాలీవుడ్ రీమేక్ లో విక్రమ్....

రీసెంట్ గా ఇంకొక్కడు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు హరి దర్శకత్వంలో స్వామి2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

సరికొత్త పాత్రలో రెజీనా....

చెన్నై సొగసరి రెజీనా కసండ్ర ఇప్పుడు విలక్షణమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. నక్షత్రం చిత్రంలో సందీప్కిషన్ సరసన నటిస్తుంది. హిందీలో అంఖే2 చిత్రంలో అమితాబ్ తో కలిసి యాక్ట్ చేస్తుంది.

నానితో మరోసారి జత కట్టనుంది...

హీరో నాని ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ బిజీ హీరో అయ్యాడు. రీసెంట్ గా మజ్నుతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్రాజు బ్యానర్ లో త్రినాథ్ దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

డిటిఎస్ మిక్సింగ్ లో అరకు రోడ్ లో...

రాం శంకర్,నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అరకు రోడ్ లో'.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో